
ఒకప్పుడు జాతీయ జట్టుకు ఎంపిక అవ్వాలంటే దేశవాళీ టోర్నీ అయిన రంజీ ట్రోఫీలో టన్నుల కొద్దీ పరుగులు చేసుండాలి. కానీ ఇప్పుడు ఐపీఎల్ ప్రదర్శన ప్రామాణికం అవుతోంది. క్యాష్ రిచ్ లీగ్‌గా పేరొందిన ఐపీఎల్ లో నాలుగు మ్యాచుల్లో రాణిస్తే చాలు.. భారత జట్టులో చోటు దక్కుతోంది. త్వరలో భారత్ - వెస్టిండీస్ మధ్య జరగబోయే టెస్ట్ సిరీస్ కు ఎంపిక చేసిన భారత జట్టే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ.
ఇవి కూడా చదవండి: 1985 తరువాత మళ్ళీ ఇంతకాలానికి.. వెల్కమ్ కమల్
వెస్టిండీస్ పర్యటనకు ఎంపికచేసిన భారత టెస్ట్ జట్టుపై పెద్ద దుమారమే రేగుతోంది. ఫస్టక్లాస్ క్రికెట్‌లో అద్భుతంగా రాణించిన సర్ఫరాజ్ ఖాన్‌ను టెస్టు జట్టులోకి ఎంపిక చేయకపోవడపై మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు బీసీసీఐ సెలెక్టర్లను బహిరంగగానే విమర్శిస్తున్నారు. తాజాగా కొందరు నెటిజెన్స్.. ఈ వివాదంలోకి మతాన్ని కూడా చొప్పిస్తున్నారు. 'సర్ఫరాజ్' ముస్లిం కుటుంబంలో జన్మించడం వల్లే అతనిపై ఈ వివక్ష అని కామెంట్స్ చేస్తున్నారు.
He is Sarfaraz khan, Mumbai Batsman.
— Dr Nimo Yadav (@niiravmodi) June 23, 2023
He was born in a Muslim family.
From the last 3 years he is the highest run scorer in Ranji trophy. He is hitting back to back 100 in domestic.
But when it came to selection for ICT, “Ruturaj” is preferred for “Sarfaraz today.
I didn’t… pic.twitter.com/VxgzdDI77L
ఫస్టక్లాస్ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తోన్న సర్ఫరాజ్
మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అయిన సర్ఫరాజ్ గత మూడేళ్లుగా దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. 27 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 79.65 సగటుతో 3505 పరుగులు చేశాడు. ఇందులో 13 సెంచరీలు ఉన్నాయి. దీంతో అతనికి టెస్టు జట్టులో చోటు ఖాయమన్న వార్తలు కూడా వచ్చాయి. అయినప్పప్పటికీ అతనికి భారత జాతీయ జట్టులో చోటు దక్కకపోవడం ఆ యువ క్రికెటర్‌కు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తిచూపుతోంది.
ఈ మాత్రం దానికి దేశవాలీ టోర్నీలు ఎందుకు?
టీ20 ఫార్మాట్ అయిన ఐపీఎల్ టోర్నీ ఆధారంగా టెస్ట్ టీమ్‌ను ఎలా ఎంపిక చేస్తారంటూ బీసీసీఐ సెలక్షన్ కమిటీని అందరూ నిలదీస్తున్నారు. కాదంటే రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైశ్వాల్‌ను ఏ విధంగా ఎంపిక చేశారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మాత్రం దానికి దేశవాలీ టోర్నీలు నిర్వహించడం ఎందుకంటూ బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.
వెస్టిండీస్ పర్యటనకు భారత టెస్టు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యస్సవి జైస్వాల్, అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆర్. అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ.