ఇలా ఉన్నారేంట్రా :కుక్క మాంసం తింటే మనుషుల్లో విశ్వాసం పెరుగుతుందట..!

ఇలా ఉన్నారేంట్రా :కుక్క మాంసం తింటే మనుషుల్లో విశ్వాసం పెరుగుతుందట..!

బెంగళూరులో వెలుగు చూసిన ఘటన కుక్క మాంసం ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్యూర్ మటన్.. గొర్ర, మేక మాంసం అని చెప్పి రాజస్థాన్ నుంచి తెప్పించి కుక్క మాంసం అమ్ముతున్నారు. అదేదో 10, 20 కేజీలు కాదు.. తనిఖీల్లో ఏకంగా 4 వేల 500 కేజీల కుక్క మాంసం పట్టుబడింది.. ఇంత పెద్ద ఎత్తున కుక్క మాంసం వెలుగులోకి రావటంతో.. బెంగుళూరు మాంస ప్రియులు షాక్ అవుతున్నారు. ఇన్నాళ్లు మేం తిన్నది మేక, గొర్ర మాంసం కాదా.. కుక్క మాంసం తిన్నామా..! అనే డౌట్ కర్ణాటక నగర జనాన్ని వెంటాడుతోంది. ఈ సమయంలో నెటిజన్లు అద్భుతమైన పంచ్ లతో తమ క్రియేటివిటీని బయటపెడుతున్నారు.

  • కుక్క మాంసం ఎందుకు అమ్ముతున్నారు అంటే.. మనుషుల్లో విశ్వాసం రోజు రోజుకు తగ్గిపోతుంది.. అందుకే కుక్క మాంసం తింటే అయినా మనుషుల్లో విశ్వాసం వస్తుందని ఇలా చేశారు..! అంటూ నెటిజన్లు మరో లెవల్లో రెచ్చిపోతున్నారు.
  • బెంగళూరు జనం ఇటీవల ఎక్కువగా మాట్లాడుతున్నారు.. ఎక్కువగా రెచ్చిపోతున్నారు కారణం ఏంటో ఇప్పుడు తెలిసింది.. వాళ్లు తింటుంది కుక్క మాంసం కదా.. అందుకే కుక్కలా తెగ అరుస్తున్నారు అంటూ మరికొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

రుచి ఒకేలా ఉందేమో..!

  • మాంసం ఏదైనా ముక్క రుచిగా ఉన్నట్లు ఉంది.. బెంగుళూరు వాసులు చైనీయులతో పోటీ పడుతున్నారు..! అంటూ  ఇంకొందరు నెటిజన్లు వ్యంగంగా కామెంట్లు చేస్తున్నారు.