రంజీ క్రికెట్ లో పాక్ దిగ్గజ క్రికెటర్ జావేద్ మియాందాద్ ఆడుతూ కనిపించాడు. అదేంటి మియాందర్ పాక్ క్రికెటర్ కదా ! రంజీల్లో ఆడటమేంటి అనుకోవచ్చు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. హర్యానా, జార్ఖండ్ ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ లో భారత ఆల్ రౌండర్ రాహుల్ తెవాటియా స్పెషల్ గెటప్ లో కనిపించాడు. ఇందులో ఆశ్చర్యం లేకపోయినా ఈ గెటప్ పాకిస్థాన్ క్రికెటర్ మియాందర్ ను పోలి ఉంది.
హర్యానా క్రికెట్ అసోసియేషన్ వారి సోషల్ మీడియా హ్యాండిల్‌లో అతని ఫోటోను పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ లుక్ పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. టివాటియా 80ల నాటి క్రికెటర్ లా కనిపిస్తున్నాడని కొంతమంది అంటుంటే..ఎక్కువ మంది పాక్ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్‌తో అతన్ని పోలుస్తున్నారు. పాకిస్తాన్ మాజీ బ్యాటర్ మియాందర్ తన కెరీర్ మొత్తం మీసాలతో మ్యాచ్ ఆడాడు. టెస్టు, వన్డేలు కలిపి 15000 పైగా అంతర్జాతీయ పరుగులు చేశాడు.
ప్రస్తుతం మియాందర్ వయసు 66 ఏళ్ళు. ఆస్ట్రేలియాలో జరిగిన 1992 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడు. మొత్తం 9 మ్యాచ్ ల్లో 62.42 సగటుతో 437 పరుగులు చేశాడు. ఇక ఆల్ రౌండర్ రాహుల్ తెవాటియా ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. టీమిండియాలో చోటు దక్కకపోయినా దేశవాళీ క్రికెట్ ఆడుకుంటున్నాడు.
Generations may come and go, Javed Miandad will always be one of the best to play for Pakistan! ??#CricketTwitter pic.twitter.com/MiBHVxRVAx
— Himanshu Pareek (@Sports_Himanshu) February 11, 2024