దసరా శరన్నవరాత్రులంటే ముందుగా గుర్తొచ్చేది కోల్‌కతా. బెంగాల్ ప్రజలు ఈ పండగను వేడుకలా జరుపుకొంటారు. అటువంటి దుర్గాపూజ వేడుకల్లో కొందరు మోడల్స్ సంప్రదాయ దుస్తులకు విరుద్ధంగా సగం బట్టలతో హల్‌చల్ చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవ్వగా.. నెటిజన్స్ వారిని తిట్టిపోస్తున్నారు.
Also Read :- తల్లిదండ్రులూ జాగ్రత్త..! బోర్బన్ బిస్కెట్‌లో ఐరన్ వైర్
ఎవరీ ముగ్గురు..?
ఫొటోలో వైరల్ అవుతున్న ముగ్గురిలో ఒకరు మోడల్ హేమోశ్రీ భద్ర. ఆమె తనను మిస్ కోల్‌కతా 2016 విజేత అని చెప్పుకుంటోంది. మరో ఇద్దరు స్నేహితులతో కలిసి హేమోశ్రీ భద్ర కోల్‌కతాలోని ఓ దుర్గా పూజ పండల్ ముందు అసభ్యకర దుస్తులతో ఫోటోలకు ఫోజులిచ్చింది. అంతటితో ఊరుకుందా అంటే లేదు. తమ నిర్వాకం అందరికీ తెలియాలని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది.
దుర్గామాత ఎదుట అసభ్యకర రీతిలో వీరి దిగిన ఫోటోలు నెట్టింట కనిపించగానే.. నెటిజెన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిగ్గూ శరం ఉందా అంటూ బండబూతులు తిడుతున్నారు. ప్రతి ఒక్కరికీ వారు కోరుకున్న విధంగా దుస్తులు ధరించే హక్కు ఉటుందని, కానీ ఆలయాలను సందర్శించినప్పుడు అందుకు అనుగుణంగా దుస్తులు ధరించడం ప్రాథమిక ఇంగితజ్ఞానం అని కొందరు కాస్త శాంతంగా వారికి బుద్ధి చెప్తున్నారు.