బాబర్ అజామ్ ఫెయిల్ అయితే గంభీర్‌ని ట్రోల్ చేస్తారా.. అసలేం జరిగిందంటే..?

బాబర్ అజామ్ ఫెయిల్ అయితే  గంభీర్‌ని ట్రోల్ చేస్తారా.. అసలేం జరిగిందంటే..?

వరల్డ్ కప్ లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ ఘోరంగా విఫలమవుతున్నాడు. దీంతో ఈ స్టార్ బ్యాటర్ ట్రోలింగ్ ఎదుర్కొంటున్నాడు. చిన్న జట్ల మీద, సొంత గడ్డపై తప్ప బాబర్ ఆడలేదని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా బాబర్ వరల్డ్ కప్ లో ఫెయిల్ అవ్వడం గంభీర్ కి తలనొప్పిగా మారింది. బాబర్ ని మించి ట్రోలింగ్ ఎదుర్కొంటూ నెటిజన్స్ కి టార్గెట్ అవుతున్నాడు. అదేంటి పాక్ బ్యాటర్ విఫలమైతే గంభీర్ ట్రోలింగ్ ఏంటి అనుకుంటున్నారా .. అయితే ఈ స్టోరీ చదివేయాల్సిందే.
 
టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఎప్పుడూ ఏదో ఒక సంచలన కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ధోనీ, కోహ్లీ, సచిన్ లాంటి దిగ్గజాల మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ఫ్యాన్స్ కోపానికి కారణమవుతాడు. వీటిలో కొన్ని నిజాలున్నప్పటికీ మరికొన్ని వివాదాలకు కారమవుతూ ఉంటాయి. వరల్డ్ కప్ కు ముందు బాబర్ అజామ్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ వరల్డ్ కప్ లో  బాబర్ అజామ్ బ్యాటింగ్ నెక్స్ట్ లెవల్లో ఉంటుందని..కోహ్లీ, రోహిత్ శర్మ, వార్నర్ లాంటి బ్యాటర్లున్నా బాబర్ బ్యాటింగ్ వీరికి మించి ఉంటుందని జోస్యం చెప్పాడు. 

Also Read :- హైదరాబాద్ లో పాకిస్తాన్ ఫ్యాన్స్

గంభీర్ ఈ వ్యాఖ్యలు చేయడం అప్పట్లో కాస్త ఆశ్చర్యంగా అనిపించాయి. మన ప్లేయర్లను సపోర్ట్ చేయకుండా పాక్ ప్లేయర్ ని పొగడడంతో భారత అభిమానుల కోపానికి కారణమయ్యాడు. అయితే బాబర్ వరల్డ్ కప్ లో ఆడిన రెండు మ్యాచుల్లో విఫలమవడంతో గంభీర్ ని ట్రోల్ చేయడం స్టార్ట్ చేసారు. మన ప్లేయర్లను కూడా గుర్తిస్తే బాగుంటుందని గంభీర్ కి హిత బోధ చేస్తున్నారు. ఇక బాబర్ రెండు మ్యాచుల్లో విఫలమైనా పాక్ మాత్రం విజయం సాధించడం విశేషం. మొత్తానికి అత్యుత్సాహం చూపించిన గంభీర్ అనవసర వ్యాఖ్యలతో భారీ మూల్యమే చెల్లించుకున్నాడు.