Sobhita and Samantha: శోభిత దుస్తులపై ట్రోలింగ్.. సమంతని కాపీ కొట్టిందంటూ కామెంట్స్..

Sobhita and Samantha: శోభిత దుస్తులపై ట్రోలింగ్.. సమంతని కాపీ కొట్టిందంటూ కామెంట్స్..

టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ గత ఏడాది ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత చైతూ కి తండేల్ రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ పడటంతో ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ తోపాటూ మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో చైతన్యకి ఎంతో ఇష్టమైన రేసింగ్ ట్రాక్స్ పై షికార్లు చేస్తూ సరదాగా గడుపుతున్నారు. అంతేకాదు ఫోటోషూట్లు కూడా చేస్తున్నారు. అయితే ఇటీవలే నాగ చైతన్య, శోభిత ప్రముఖ మ్యాగిజైన్ "వోగ్" కవర్ ఫొటోస్ కి ఫోజులిచ్చారు. ఇందులో నాగచైతన్య, శోభిత మంచి స్టైలిష్ దుస్తులలో కనిపించారు.

ALSO READ | Pelli Kani Prasad Review: మూవీ రివ్యూ.. ఫన్ బ్లాస్ట్‌‌‌‌గా సప్తగిరి 'పెళ్లి కాని ప్రసాద్'.. కథేంటంటే?

ఈ ఫోటోషూట్ లో శోభిత ధరించిన దుస్తులు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. అయితే శోభిత అఖ్ల్ బ్రాండ్ కి చెందిన సిల్వర్ కలర్ టాసెల్-డిటెయిలింగ్ స్లిప్ డ్రెస్ ధరించింది. దీని ధర దాదాపుగా రూ. 49,593 పైగా ఉంది. అయితే ఓ నెటిజన్ ఈ ఫోటోలపై స్పందిస్తూ శోభిత గతంలో సమంత ధరించిన దుస్తులను ధరించి కాపీ కొట్టిందని కామెంట్ చేశాడు. అయితే గతంలో నాగ చైతన్య మాజీ భార్య స్టార్ హీరోయిన్ సమంత శోభిత డ్రెస్ ని పోలి ఉన్న ఓంబ్రే-హ్యూడ్ టాసెల్డ్ స్కర్ట్ ని ధరించి ఫోటోలై ఫోజులిచ్చింది. దీంతో వీరిద్దరూ ధరించిన దుస్తులు ఒకేలా ఉన్నాయని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు..

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by VOGUE India (@vogueindia)

ఈ విషయం ఇలా ఉండగా నాగ చైతన్య సమంత  2017లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాగ చైతన్య సమంతతో "ఏ మాయ చేసావే" సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డాడు. ఆ ఆతర్వాత ఆటోనగర్ సూర్య, మజిలీ, మనం తదితర సినిమాల్లో వేరు కలసి నటించారు. కానీ అనుకోకుండా పెళ్లయిన 5 ఏళ్ళ తర్వాత పరస్పర అంగీకారంతో 2021లో విడాకులు తీసుకుని విడిపోయారు. ఈ సంఘటన జరిగిన 4ఏళ్ళ తర్వాత చైతూ మళ్ళీ శోభితని పెళ్లి చేసుకున్నాడు. కానీ సమంత మాత్రం మళ్ళీ పెళ్లి చేసుకోలేదు.