గద్వాల, వెలుగు: నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం పెండింగ్ పనులను కంప్లీట్ చేసి రైతులకు రెండు పంటలకు నీళ్లివ్వాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ రామాంజనేయులు డిమాండ్ చేశారు. సోమవారం ధరూర్ మండలంలోని ర్యాలంపాడు రిజర్వాయర్ ను బీజేపీ లీడర్లు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 10 శాతం పెండింగ్ పనులను బీఆర్ఎస్ ప్రభుత్వం కంప్లీట్ చేయలేదని, ప్రస్తుత ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ర్యాలంపాడు రిజర్వాయర్ లో నాలుగేండ్ల నుంచి ఒక టీఎంసీ నీటిని మాత్రమే నిల్వ ఉంచుతున్నారని, దీంతో రైతులకు రెండు పంటలకు నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. నెట్టెంపాడు పెండింగ్ పనులను కంప్లీట్ చేయాలని, ర్యాలంపాడు రిజర్వాయర్ రిపేర్లు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రైతులతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. బలిగేర శివారెడ్డి, మధుసూదన్ రావు, కిష్టన్న, అనిల్, జనార్దన్ రెడ్డి ఉన్నారు.