
తెలంగాణ రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించి అభివృద్ధి చేయటానికి కొత్త ప్రణాళికలు, విధివిధానాలు తీసుకొస్తున్నట్లు స్పష్టం చేశారు మంత్రి భట్టి విక్రమార్క. హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించి.. అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు.
ఔటర్ రింగ్ రోడ్డు లోపల హైదరాబాద్ పట్టణ ప్రాంతంగా ఉంటుంది.
ఔటర్ రింగ్ రోడ్డు.. ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డు మధ్య సెమీ అర్బన్ ఏరియాగా గుర్తింపు.
ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డు తర్వాత అంతా తెలంగాణ గ్రామీణ ప్రాంతం
హైదరాబాద్ కేంద్రం మూడు జోన్లుగా విభజించి.. అభివృద్ధి ప్రణాళికలు రచిస్తామని.. అన్ని ప్రాంతాలు సమానంగా వృద్ధిలోకి తీసుకురావటానికి త్వరలోనే విధివిధానాలు, కార్యచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు మంత్రి భట్టి విక్రమార్క.