ఎప్పుడు బిజీబిజీగా ఉండే ఎలక్ట్రానిక్ సిటీ బెంగళూరులో ట్రాఫిక్ తిప్పలు అంతా ఇంతాకావు..విసుగు పుట్టించే హెవీ ట్రాఫిక్..సిలికాన్ వ్యాలీ వాసుల గంటలు గంటల టైమ్ వృధా అవుతోంది. ఒక్క బెంగళూరు నగరమే కాదు.. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో కూడా ఇదే పరిస్థితి మనందరికి తెలుసు. అయితే ఈ మహానగరాల్లో ట్రాఫిక్ చెక్ పెట్టే ఓ కొత్త ఆవిష్కరణ జరిగింది.
బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు లిమిటెడ్, సరళా ఏవియేషన్ సంస్థ కలిసి ఎయిర్ టాక్సీలను రూపొందించారు. బెంగళూరు సిటీలో కీ ఏరియాలనుంచి కెంపెగౌడ్ ఎయిర్ పోర్టుకు నిమిషాల్లో ప్రయాణించేందుకు, భారీ ట్రాఫిక్ కు చెక్ పెట్టేందుకు ఈ ఎయిర్ టాక్సీలు త్వరలో అందుబాటులోకి రాను న్నాయి.
BIAL, సరళా ఏవియేషన్ సంస్థలు కలిసి ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్( eVTOL) ఎయిర్ క్రాఫ్ట్ లను తయారు చేశారు. ఈ వినూత్న ఎలక్ట్రిక్ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా 1.5 గంటల ప్రయాణ సమయాన్ని కేవలం ఐదు నిమిషాల్లో చేరుకుకోవచ్చు. అంటే eVTOL లో ప్రయాణించి సిటీ హాట్ స్పాట్ లనుంచి కేవలం 20 నిమిషాల్లో ఎయిర్ పోర్టు చేరుకోవచ్చు. రోడ్డు మార్గంలో అయితే బెంగళూరు సిటీలోని ప్రధాన ప్రాంతాలనుంచి ఎయిర్ పోర్టుకు చేరుకోవాలంటే.. 152 నిమిషాల సమయం పడుతుంది.
eVOTOL అంటే..
ఎయిర్ క్రాఫ్ట్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్(eVTOL) కరెంట్ తో నడిచే ఏడు సీట్ల విమానం. ఇది హెలికాప్టర్ లాగా నిలువుగా టేకాఫ్ కావడం, ల్యాండింగ్ చేయగలదు. ఈ విమానాలను ఎయిర్ టాక్సీలు, కార్గో డెలివరీ, వైద్య సేవలలతో సహా పట్ణణ, ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ ను చేయడానికి వినియోగించనున్నారు.
లెటెస్ట్ ఎయిర్ మొబిలిటీ లో ఇది గొప్ప రెవల్యూషన్ కావొచ్చంటున్నారు టెక్ నిపుణులు. eVTOLలు ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు, నగరంలో పవర్ ఫుల్ ట్రాన్స్ పోర్టు సిస్టమ్ ల రూపకల్పనకు సహాయపడుతుందని భావిస్తున్నారు.
ఈ ఎయిర్ టాక్సీలు ఒకాసారి ఛార్జింగ్ పెడితే 160 కిలోమీటర్లు దూరం ప్రయాణించగలవు. అయితే 20నుంచి 40 కిలోమీటర్లు లోపు ప్రయాణాలను ఇది మంచి అనుకూలం. ముంబై, బెంగళూరు ఢిల్లీ వంటి నగరాల్లో ప్రయాణికులు తమ ప్రయాణ సమయాన్ని 87 శాతం ఆదా చేసుకోవచ్చు. ఉదాహరణకు ఎలక్ట్రానిక్ సిటీ నుంచి ఎయిర్ పోర్టుకు రోడ్డు మార్గంలో అయితే 152 నిమిషాలు పడుతుంది.. అదే ఈ ఎయిర్ టాక్సీ ల ద్వారా కేవలం 20 నిమిషాల్లో చేరుకోవచ్చు.
ఈ మినీ ఎయిర్ క్రాఫ్ట్ లో నాలుగు బ్యాటరీలు, ఏడు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ఇది గంటలకు 250 కిలోమీటర్లు వేగంతో దూసుకుపోతుంది. ఒక పైలట్, ఆరుగురు ప్రయాణికులు వారి లగేజీతో సౌకర్యవంతంగా ప్రయాణించొచ్చు. ఇది ఒకసారి 15నిమిషాలపాటు ఛార్జింగ్ చేస్తే 40 కిలోమీటర్లు చాలాసార్లు ప్రయాణించవచ్చు.
సో.. ఈ ఎయిర్ టాక్సీలతో ముంబై, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయన్నమాట. వేచి చూద్దాం.