సత్యనారాయణపురం పీహెచ్​సీకి అంబులెన్స్

భద్రాచలం, వెలుగు : చర్ల మండలం సత్యనారాయణపురం పీహెచ్​సీకి కొత్తగా అంబులెన్స్ ను కేటాయించారు. ఈ మేరకు గురువారం భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్​తెల్లం వెంకట్రావు, ఐటీడీఏ పీవో బి.రాహుల్​ అంబులెన్స్ ను ప్రారంభించారు. గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ అంబులెన్స్ మంజూరు చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంఅండ్​హెచ్​వో డాక్టర్​ చైతన్య తదితరులు పాల్గొన్నారు.