యాపిల్ నుంచి కొత్త ఇయర్ బడ్స్

యాపిల్ నుంచి కొత్త ఇయర్ బడ్స్

ఇటీవలే సెకండ్ జనరేషన్ ఇయర్ బడ్స్ (ఎయిర్ పాడ్స్ 2)ని విడుదల చేసిన యాపిల్ సంస్థ తాజాగా మరో వైర్ లెస్ ఇయర్ బడ్స్ ని రిలీజ్ చేసింది. అయితే ఇవి విడుదలైంది ‘యాపిల్’సంస్థ నుంచి కాదు. యాపిల్ ఉప సంస్థ‘బీట్స్ ఎలక్ట్రానిక్స్’ నుంచి . ‘బీట్స్’పేరుతో స్పీకర్స్, ఇయర్ ఫోన్స్  వంటి యాక్సెసరీస్ రూపొందిస్తోంది. ఇటీవల‘పవర్ బీట్స్ ప్రొ’ పేరుతో వైర్ లెస్ ఇయర్ ఫోన్స్ ను విడుదల చేసింది. ఇవి కూడా ఎయిర్ పాడ్స్ లాగే స్పెషల్ చార్జింగ్ కేస్ కలిగి ఉన్నాయి . వీటి బ్యాటరీ లైఫ్ 24 గంటలు కావడం విశేషం. యాపిల్ ఉత్పత్తులకు ‘సిరి’ వాయిస్ సపోర్ట్​ అందిస్తాయి .

మొబైల్ ఫోన్లతో కనెక్టివిటీ బాగుండేలా యాపిల్ ఫోన్లలో వాడే ‘హెచ్1’ చిప్ ను వీటిలో వాడారు. ఇప్పటికే మార్కెట్లో పవర్ బీట్స్ మోడల్ ఇయర్ బడ్స్ ఉన్నాయి .లేటెస్ట్​ మోడల్ పవర్ బీట్స్ 3 కన్నా,ఇవి 23 శాతం చిన్నగా, 17 శాతం తక్కువ బరువు కలిగి ఉన్నాయని కంపెనీ తెలిపింది. దీనివల్ల ఇవి యూజర్లకు మరింత సౌకర్యంగా ఉంటాయని,చెవుల్లో సులభంగా ఇమిడి పోతాయని చెప్పింది. ఒక్కసారి చార్జ్​ చేస్తే నాన్ స్టాప్ గా తొమ్మిది గంటల పాటు సంగీతం వినొచ్చని ‘బీట్స్’ ప్రకటించింది. ఫాస్ట్​ చార్జింగ్ కెపాసిటీ కలిగి ఉన్నాయని, ఐదు నిమిషాలు చార్జ్​ చేస్తే గంటన్నరపాటు మ్యూజిక్ వినొచ్చని వెల్లడించింది. వీటిధర మన దేశంలో ఇరవై వేల రూపాయల వరకు ఉండే అవకాశం ఉంది.