డాక్టర్కు బదులు నర్సు ప్రసవం.. పురిట్లోనే మగ శిశువు మృతి

రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు పెరుగుతున్నాయని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్న రియాల్టీకి వచ్చేసరికి చాలా తేడా ఉంది.  తాజాగా  కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో  వైద్యాధికారుల నిర్లక్ష్యం కారణంగా  పురిట్లోనే ఓ  మగ శిశువు మృతి  చెందింది.  భీముని దుబ్బ ప్రాంతానికి చెందిన జాల మౌనిక అనే గర్భిణి డెలివరీ కోసం 2023 మే 30న  ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. అయితే  పురిట్లోనే  బిడ్డ చనిపోయింది. 

డాక్టర్ కు బదులు నర్సు ప్రసవం చేయడం వల్లే బిడ్డ చనిపోయిందని మౌనిక తరుపు బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు.  అయితే దీనిని ఆసుపత్రి వైద్యులు ఖండిస్తున్నారు.  పుట్టినప్పుడే బాబు అనారోగ్యంతో జన్మించాడని వైద్యులు చెబుతున్నారు.  ఇవాళ సాయంత్రం స్టాఫ్ నర్స్ నార్మల్ డెలివరీ చేసినట్లు ఆరోపిస్తున్నారు.  ఆసుపత్రి వైద్యులు, నర్సులపై చర్యలు తీసుకోవాలని మౌనిక తరుపు బంధువులు డిమాండ్ చేస్తున్నారు.