కొత్త బస్టాండ్​ ప్రారంభమెప్పుడో..?

కొత్త బస్టాండ్​ ప్రారంభమెప్పుడో..?

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రం శివారులో నిర్మించిన కొత్త బస్టాండ్  ప్రారంభానికి ఎదురు చూస్తోంది. 2017 ఫిబ్రవరిలో శంకుస్థాపన చేయగా, రెండేండ్ల కింద నిర్మాణం పూర్తి చేశారు. ఇప్పటికీ బస్టాండ్​ను ప్రారంభించకపోవడంతో నిరుపయోగంగా మారింది. ఇప్పుడు ఇలా సంచార జాతుల వారు ఇక్కడ సేద తీరుతున్నారు. 

తాత్కాలిక బస్టాండ్​ ప్రాంతంలో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతూ బస్సుల కోసం వేచి ఉండాల్సి వస్తోంది. ప్రస్తుతం  ఎండకాలం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లక్షలు వెచ్చించి కొత్త బస్టాండ్​ను నిర్మించినా ప్రారంభించకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్​ చేస్తున్నారు.  - మొగుళ్లపల్లి, వెలుగు