జార్ఖండ్‎లో కొలువుదీరిన కొత్త కేబినెట్.. మంత్రులుగా 11 మంది ప్రమాణ స్వీకారం

జార్ఖండ్‎లో కొలువుదీరిన కొత్త కేబినెట్.. మంత్రులుగా 11 మంది ప్రమాణ స్వీకారం

రాంచీ: జార్ఖండ్‎లో ఎట్టకేలకు రాష్ట్ర కేబినెట్​కొలువుదీరింది. సీఎం హేమంత్​ సోరెన్​నేతృత్వంలోని మంత్రి మండలి గురువారం మధ్యాహ్నం12:50 గంటలకు రాజ్​భవన్‎లో ప్రమాణ స్వీకారం చేసింది. మొత్తం 11 మంది ఎమ్మెల్యేలను కేబినెట్‎లోకి తీసుకున్నారు. మొదట మహేశ్​పూర్​ఎమ్మెల్యే స్టీఫెన్​మరాండీతో విధాన సభ ప్రొటెం స్పీకర్‎గా జార్ఖండ్​గవర్నర్​సంతోష్​ గంగ్వార్​ప్రమాణం చేయించారు. అనంతరం ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. 

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హేమంత్​ సోరెన్‎కు చెందిన జేఎంఎం​నేతృత్వంలోని ఇండియా కూటమి 81 సీట్లకు 56 గెలుచుకొని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ 21 సీట్లకే పరిమితమైంది. హేమంత్​ సోరెన్‎ను ఇండియా కూటమి శాసనసభా పక్ష నేతగా ఎన్నుకోవడంతో గత నెల 28న సీఎంగా ఆయన ప్రమాణం చేశారు. కాగా, జేఎంఎం నుంచి ఆరుగురికి, కాంగ్రెస్​నుంచి నలుగురికి, ఆర్జేడీ నుంచి ఒకరికి కేబినెట్ బెర్తులు దక్కాయి.