బీరుట్: హెజ్బొల్లా కొత్త చీఫ్‌గా డిప్యూటీ సెక్రటరీ జనరల్ షేక్ నయీం ఖాసీంను ఆ సంస్థ ఎంపిక చేసింది. ఈమేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. లెబనాన్ రాజధాని బీరుట్‌పై సెప్టెంబర్ 27న ఇజ్రాయెల్ జరిపిన దాడిలో నస్రల్లా మృతి చెందాడు. అతడి మరణం తర్వాత నస్రల్లా బంధువు హషీమ్ సఫీద్దీన్‌ను హెజ్బొల్లా వారసుడిగా భావించారు.
అయితే సఫీద్దీన్ కూడా ఇజ్రాయెల్ దాడుల్లో మరణించడంతో కొత్త చీఫ్‌గా ఖాసీంను హెజ్బొల్లా ఎంపిక చేసింది. ఇరాన్మద్దతుగా సాగుతున్న ఉద్యమంలో ఖాసీంకు 30 ఏండ్లకు పైగా అనుభవం ఉన్నది.
1991లో ఖాసీంను అప్పటి హెజ్బొల్లా సెక్రటరీ జనరల్ అబ్బాస్ ఆల్ ముసావీ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా నియమించాడు. ఆ తర్వాత సంవత్సరమే ఇజ్రాయెల్ హెలికాప్టర్ అటాక్‌లో ముసావీ మృతిచెందాడు. అప్పటినుంచి హెజ్బొల్లాకు ఖాసీం వ్యూహకర్తగా ఉన్నాడు.