
హైదరాబాద్, వెలుగు: చాముండి, లావా ..ఇవేవో ముద్దు పేర్లు కావు సెల్ ఫోన్లు అసలేకావు. త్వరలో రాబోతున్న కొత్త మిర్చి రకాలు. సీడ్ప్రొడక్షన్ కంపెనీ ‘ఈస్ట్ – వెస్ట్ సీడ్ ఇండియా’ చాముండి, లావా పేరిట తెలంగాణలో రెండు నూతన మిర్చి రకాలను ప్రవేశపెట్టింది. ఇవి రైతుల ఖర్చులను తగ్గిస్తాయి. పంట త్వరగా చేతికి వస్తుంది. చిన్నకమతాల రైతులు తమ దిగుబడులను త్వరగా మార్కెట్ కు తీసుకెళవ్లచ్చు. లావా మిర్చి ఎరుపుగా, పొట్టిగా ఉంటుంది.
లీఫ్ కర్ల్ (ఆకు ముడత) వ్యాధిని తట్టుకునే శక్తి ఉంటుంది. పలు కోతల దాకా కూడా కాయ పరిమాణం నిలకడగా ఉంటుంది. ఎగుమతులకూ అనువైనవి. చాముండి కాస్త పొడవు ఉంటుంది. లీఫ్ కర్ల్ (ఆకు ముడత) వ్యాధిని తట్టుకుంటుంది. కలర్ వాల్యూ బాగుంటుంది కాబట్టి చిల్లీ పౌడర్ పరిశ్రమకు అనువుగా ఉంటుందని ఈస్ట్ –వెస్ట్ సీడ్ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ రాజన్ చెప్పారు.