నిర్మల్​, మంచిర్యాలకు కొత్త కలెక్టర్లు

నిర్మల్​, మంచిర్యాలకు కొత్త కలెక్టర్లు

మంచిర్యాల/నిర్మల్, వెలుగు: నిర్మల్, మంచిర్యాల​కలెక్టర్లు బదిలీ అయ్యారు. వారి స్థానంలో ప్రభుత్వం కొత్తవారిని నియమించింది. నాగర్​కర్నూల్​అడిషనల్​కలెక్టర్ (లోకల్​బాడీస్)​గా పనిచేస్తున్న కుమార్​ దీపక్​ను కలెక్టర్​గా ప్రమోట్ ​చేస్తూ మంచిర్యాలకు ట్రాన్స్​ఫర్ చేశారు. 

ప్రస్తుత కలెక్టర్​ బదావత్ సంతోష్ ​నాగర్​కర్నూల్​కు బదిలీ అయ్యారు. కొత్త కలెక్టర్ ​కుమార్​ దీపక్ ​జిల్లాకు సుపరిచితులే. 2018 బ్యాచ్​కు చెందిన ఆయన 2019–20లో జిల్లాలో ట్రెయినీ అసిస్టెంట్​కలెక్టర్​గా పనిచేశారు. ఇక నిర్మల్ జిల్లా కలెక్టర్​గా అభిలాష అభినవ్ నియమితులయ్యారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో జోనల్ కమిషనర్​గా విధులు నిర్వహిస్తున్న ఆమెను నిర్మల్​కు కలెక్టర్​గా బదిలీ చేశారు. ఇక్కడి కలెక్టర్​ ఆశిష్ సంగ్వాన్​ను కామారెడ్డికి ట్రాన్స్​ఫర్ ​చేశారు.