సరికొత్త కాంబో.. పూరి-సేతుపతి పాన్ ఇండియా మూవీ ఫిక్స్

సరికొత్త కాంబో.. పూరి-సేతుపతి పాన్ ఇండియా మూవీ ఫిక్స్

విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. వీరిద్దరి కాంబోపై గత కొన్నిరోజులుగా వస్తున్న వార్తలను ఉగాది రోజున అధికారికంగా ప్రకటించారు. పాన్ ఇండియా మూవీగా దీన్ని రూపొందించనున్నట్టు,  జూన్‌‌‌‌‌‌‌‌లో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నట్టు తెలియజేశారు.  పూరి జగన్నాథ్ , ఛార్మి కౌర్ కలిసి నిర్మించనున్నారు.  

విజయ్ సేతుపతికి తెలుగులో మంచి క్రేజ్ ఉంది. ఆయన ఇమేజ్‌‌‌‌‌‌‌‌ను దృష్టిలో పెట్టుకుని పూరి జగన్నాథ్ పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్ స్ర్కిప్ట్‌‌‌‌‌‌‌‌ను సిద్ధం చేశారట.  ఇందులో విజయ్‌‌‌‌‌‌‌‌ని  సరికొత్తగా చూపించబోతున్నట్టు, ఆయన స్ర్కీన్ ప్రెజెన్స్ అందర్నీ ఇంప్రెస్ చేసేలా ఉంటుందని మేకర్స్ చెప్పారు. త్వరలోనే మరిన్ని అప్‌‌‌‌‌‌‌‌డేట్స్ అందిస్తామన్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి ‘బెగ్గర్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రేజీ కాంబోపై అనౌన్స్‌‌‌‌‌‌‌‌మెంట్ రోజునే అంచనాలు పెరిగాయి.