కొలువుదీరిన జములమ్మ ఆలయ కమిటీ

గద్వాల, వెలుగు: నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ ఆలయ కొత్త కమిటీ శనివారం కొలువుదీరింది. చైర్మన్ గా వెంకట్రాములు, సభ్యులుగా మధుమతి, రాధారెడ్డి, వెంకటేశ్ బాబు, వీరేశ్, ముసలన్న, శ్రీనివాసులు, రాజు, నాగరాజు, కృష్ణ, మల్లేశ్, చంద్రశేఖర్  ప్రమాణస్వీకారం చేశారు. ఎండోమెంట్ ఆఫీసర్లు వెంకటేశ్వరమ్మ, పురేందర్ పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్​రెడ్డి మాట్లాడుతూ జములమ్మ ఆలయ డెవలప్​మెంట్ కు తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. రూ.2 కోట్లతో జములమ్మ ఆలయం వద్ద అభివృద్ధి పనులకు త్వరలోనే శంకుస్థాపన చేస్తామని చెప్పారు. రూ.80 లక్షలతో కల్యాణ మండపం, రూ. 60 లక్షలతో షాపింగ్​ కాంప్లెక్స్​ నిర్మిస్తామని తెలిపారు.