ఇక వారికి తిరుమల శ్రీవారి కళ్యాణం టికెట్ఈజీ.. ఎవరి కంటే

వివాహ బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించబోయే జంటలకు టీటీడీ గుడ్‌న్యూస్ చెప్పింది. కొత్త జంటలకు తిరుమల శ్రీవారి ఆశీస్సులు పొందే అవకాశాన్ని కల్పించింది. పెళ్ళైన వెంటనే తిరుమలకు వచ్చి నూతన వధూవరులు శ్రీవారి కళ్యాణంలో పాల్గొని మొక్కులు తీర్చుకుంటామని మొక్కుకుంటారు. అలాంటి  నూతన వధూవరులకు టీటీడీ ప్రత్యేక అవకాశం కల్పిస్తోంది. అదేంటో ఇప్పుడు చూసేద్దాం.

నూతన వధూవరులు తిరుమలకు వచ్చి శ్రీవారి కల్యాణంలో పాల్గొంటే సకల సౌఖ్యాలు., దాంపత్య జీవితం సాఫీగా సాగుతుందని భక్తుల విశ్వాసం. మరికొందరు ఇరు జంటలు పెళ్లి ద్వారా ఒక్కటయ్యే శుభకార్యం నిర్విజ్ఞంగా సాగాలని మొక్కుకుంటారు. అలా పెళ్లి జరిగితే స్వామి వారి కళ్యాణ సేవలో పాల్గొంటామని భక్తులు స్వామి వారికి వేడుకుంటారు. అనంతరం కళ్యాణ సేవలో పాల్గొనాలని తిరుమలకు వస్తారు. అయితే ఎలా టికెట్ పొందాలో… ఎక్కడికి వెళ్లాలో  తెలియదు. నూతన వధూవరుల కోసం టీటీడీ రోజుకు 20 టికెట్లను కేటాయించింది. టికెట్ రూ.1,000. ఇందులో కళ్యాణోత్సవం, ప్రత్యేక దర్శనం కలిపే ఉంటాయి.

also read :- అయ్యప్ప దీక్ష: ఓ పక్క ఆధ్యాత్మికం.. మరో పక్క ఆరోగ్యం..

ఈ టికెట్ పొందాలంటే కొన్ని నియమాలు పాటించాలి. పెళ్ళైన కొత్త జంట ముందుగా సిఆర్ఓ కార్యాలయంలోని ఆర్జిత సేవా లక్కీ డిప్ కౌంటర్ కి వెళితే చాలు. ఫోటో ప్రూఫ్ క్రింద వధూవరుల పెళ్లి నాటి ఫోటో తప్పనిసరి. ఇక లిఖిత పూర్వక ప్రూఫ్ క్రింద వెడ్డింగ్ కార్డు కూడా తప్పనిసరి. పెళ్లై వారం రోజుల లోపే ఉండాలి. వీటితో పాటుగా ఆధార్ కార్డ్ సైతం తప్పనిసరిగా ఇవాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ ద్వారా నూతన వధూవరులు నేరుగా కల్యాణోత్సవ టికెట్ పొందవచ్చని టీటీడీ అధికారులు తెలిపారు.