- వర్సిటీ ప్రొఫెసర్ జీఆర్సీ రెడ్డి వెల్లడి
హసన్‌పర్తి, వెలుగు : హనుమకొండ జిల్లా హసన్‌పర్తి శివారులోని ఎస్‌ఆర్ యూనివర్సిటీలో కొత్త కోర్సులు ప్రారంభిస్తున్నట్లు వర్సిటీ వీసీ ప్రొఫెసర్ జీఆర్సీ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన కొత్త కోర్సుల వివరాలను మీడియాకు వెల్లడించారు. విద్యార్థులు వివిధ అంశాలలో పరిజ్ఞానం పొంది, ప్రాబ్లమ్స్‌ను సాల్వ్చేసేలా డ్యుయల్ డిగ్రీ, ఐఈపీ విధానాలను అందిస్తామని తెలిపారు. ఐఈపీ విధానంలో బీటెక్, బీబీఏ విద్యార్థులు ఎస్‌ఆర్ యూనివర్సిటీలో చదువుకుంటూనే.. ఎంబీఏ, ఎమ్మెస్సీ, ఫైనాన్స్, ఎమ్మెస్ బిజినెస్, అనలిటిక్స్ చదువుకోవచ్చని ఆయన చెప్పారు. అలాగే, చివరి సంవత్సరం చదువుకుంటూ తక్కువ ఖర్చుతో విదేశాలలో (కొలాబకేటివ్ యూనివర్సిటీలో) జీ ఆర్ సీ స్కోర్ లేకుండా ఎమ్మెస్ ప్రోగ్రాం చేయవచ్చన్నారు.
బైపీసీ విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్స్ అందించి బీటెక్ చేసుకొనే వెసులుబాటు కల్పిస్తున్నామన్నారు. ఎంటెక్ లో కొత్తగా డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లర్నింగ్ ఈ అకడమిక్ ఇయర్ నుంచి ప్రారంభిస్తామని తెలిపారు. స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్, స్కూల్ ఆఫ్ సైన్సెస్, బిజినెస్, డిజైన్ విభాగాల్లో యూజీ, పీజీ కోర్సులతో పాటు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, ఫిట్ నెస్, అథ్లెటిక్స్, కండిషనింగ్ ఏవియేషన్, బయోటెక్నాలజీ, బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, బీకాం కంప్యూటరైజ్డ్ అకౌంట్స్, జీఎస్టీ ఇంటర్నేషనల్ అకౌంట్స్ అఫ్ ఫైనాన్స్, ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ, అగ్రికల్చర్ సైన్సెన్, స్టాటిస్టిక్స్ డిజైన్ ప్రోగ్రాంలో ఏవియేషన్ ప్రొడక్ట్ డిజైన్, బీసీఏ, ఎంసీఏ కోర్సులు ప్రవేశపెడుతున్నామని తెలిపారు.
హెల్త్ సైన్సెస్‌లో ప్రస్తుతం విరివిరిగా అవకాశాలు ఉన్నందున.. ఆ విభాగంలో ఫిజియోథెరపీ మెడికల్ బయోటెక్నాలజీ, రేడియాలజీ, ఇమేజింగ్ టెక్నాలజీ, కార్డియో వస్క్యులర్, కార్డియోకేర్ టెక్నాలజీలో యూజీ, పీజీ కోర్సులు ప్రవేశపెడతామని వెల్లడించారు. అనంతరం రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఆర్ యూనివర్సిటీ డ్యూయల్ డిగ్రీలు, వివిధ కోర్సులు ప్రవేశపెట్టడం ఎంతో గొప్ప విషయమన్నారు. తక్కువ ఖర్చు, తక్కువ శ్రమతో డిగ్రీలు సాధించవచ్చన్నారు.