
మంచిర్యాల, వెలుగు: ప్రజలకు పారదర్శక సేవలు అందించాలని రామగుండం కొత్త పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. మంచిర్యాల పోలీస్ స్టేషన్ను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ నిర్వహణ, నమోదైన కేసులు, సిబ్బంది గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నేరాల నియంత్రణకు చేపడుతున్న చర్యలు, రౌడీ షీటర్ల బైండో వర్లు, కౌన్సిలింగ్ తదితర అంశాలపై ఆరా తీశారు. కమిషనరేట్ పరిధిలో మంచిర్యాల కీలకమైన ప్రాంతమని.. శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ కంట్రోల్ విషయాల్లో అలర్ట్ గా ఉండాలని సూచించారు. డీసీపీ ఎ.భాస్కర్, సీఐలు ప్రమోద్ రావు, నరేశ్ కుమార్, సత్యనారాయణ పాల్గొన్నారు.