Soyuz MS-27: సోయుజ్ MS-27 రాకెట్ ప్రయోగం సక్సెస్..కొత్తగా ISS చేరిన ముగ్గురు వ్యోమగాములు

Soyuz MS-27: సోయుజ్ MS-27 రాకెట్ ప్రయోగం సక్సెస్..కొత్తగా ISS చేరిన ముగ్గురు వ్యోమగాములు

అమెరికా, రష్యా సంయుక్తంగా చేపట్టిన సోయూజ్ MS27 బూస్టర్ రాకెట్ ప్రయోగం సక్సెస్ అయింది.రష్యాకు చెందిన ఈ అంతరిక్ష నౌక  సురక్షితంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కక్ష్యలోకి చేరింది.కజకిస్తాన్‌లోని రష్యా లీజుకు తీసుకున్న బైకోనూర్ ప్రయోగ కేంద్రం నుండి షెడ్యూల్ ప్రకారం సోయుజ్ బూస్టర్ రాకెట్ ప్రయోగించారు. 

సోయుజ్ MS-27ను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. నాసా వ్యోమగామి జానీ కిమ్ ,రష్యా వ్యోమగాములు సెర్గీ రిజికోవ్, అలెక్సీ జుబ్రిట్స్కీలు మూడు గంటల తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష స్టేషన్‌లో దిగారు. ఈ ముగ్గురు వ్యోమగాములుదాదాపు ఎనిమిది నెలలు అంతరిక్ష కేంద్రంలో గడపనున్నారు.తిరిగి 2025 డిసెంబర్‌లో తిరిగి భూమికి తిరిగి రానున్నారు. కిమ్ ,జుబ్రిట్స్కీలకు ఇది మొదటి అంతరిక్ష ప్రయాణం కాగా.. రిజికోవ్‌కు ఇది మూడవది.

భవిష్యత్ అంతరిక్ష కార్యకలాపాలకు సిబ్బందిని సిద్ధం చేయడంలో సహాయపడటానికి మరియు భూమిపై ప్రజలకు ప్రయోజనాలను అందించడానికి కిమ్ శాస్త్రీయ పరిశోధనలు మరియు సాంకేతిక ప్రదర్శనలను నిర్వహిస్తారని నాసా తెలిపింది. లాస్ ఏంజిల్స్‌కు చెందిన కిమ్, యుఎస్ నేవీ లెఫ్టినెంట్ కమాండర్ మరియు డ్యూయల్-డిజిగ్నేటెడ్ నావల్ ఏవియేటర్,ఫ్లైట్ సర్జన్.