న్యూఢిల్లీ: న్యూ ఎనర్జీ, పెట్రోకెమికల్స్ బిజినెస్‌ను చూసుకోవడానికి కొత్త డైరెక్టర్‌ను ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) నియమించింది. అరుంగషు సర్కార్‌ను కార్పొరేట్ అఫైర్స్, స్ట్రాటజీకి డైరెక్టర్‌గా నియమించామని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. సర్కార్ ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్‌లో పెట్రోలియం ఇంజినీరింగ్ పూర్తిచేశారు. ఓఎన్‌జీసీలో గ్రూప్ జనరల్ మేనేజర్‌గా పనిచేశారు.
ఓఎన్‌జీసీ విదేశ్ లిమిటెడ్‌లో జనరల్ మేనేజర్‌గా సేవలందించారు. ఆన్‌షోర్, ఆఫ్‌షోర్ బిజినెస్‌లను చూసుకునే రెండు డైరెక్టర్ పోస్టులను మెర్జ్ చేసి, స్ట్రాటజీ అండ్ కార్పొరేట్ అఫైర్స్, ప్రొడక్షన్ కోసం సపరేట్‌గా డైరెక్టర్ పోస్టులను ఓఎన్‌జీసీ బోర్డు క్రియేట్ చేసింది.