తెలంగాణలో కొత్త విద్యా కమిషన్.. ఉత్తర్వులు జారీ

తెలంగాణలో కొత్త విద్యా కమిషన్.. ఉత్తర్వులు జారీ

తెలంగాణలో కొత్త విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తూ సర్కార్ ఉత్వర్వులు జారీ చేసింది. చైర్మన్ తోపాటు ముగ్గురు సభ్యులు,సెక్రటరీతో ఈ కమిషన్ ఏర్పాటైంది. విద్యా రంగంలో మార్పులు, విద్యారంగం బలోపేతానికి ఈ కమిషన్ ను నియమించారు. 

ఉన్నత విద్యా నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం నజర్ పెట్టింది. ప్రీ ప్రైమరీ నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు కమిషన్ సూచనలివ్వనుంది. త్వర లో విద్యాకమిషన్  చైర్మన్,  సభ్యులను నియమించనున్నారు. రెండేళ్ల కాలపరిమితితో ఈ కమిషన్ పనిచేస్తుంది.