హైదరాబాద్‌సిటీ, వెలుగు: గ్రేటర్ ఆర్టీసీ అధికారులు విడతల సిటీలో గ్రీన్ ఎలక్ట్రిక్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులను అందుబాటులోకి తెస్తున్నారు. తాజాగా ఎన్జీఓస్ కాలనీ నుంచి లింగంపల్లికి కొత్త బస్సులు ప్రారంభించారు. ఈ బస్సులు బీఎన్‌రెడ్డి నగర్ మీదుగా మందమల్లమ్మ, ఆరాంఘర్, నానల్‌నగర్ క్రాస్ రోడ్, దర్గా, ఖాజాగూడ క్రాస్‌రోడ్స్, ఖాజాగూడ, నానక్‌రామ్‌గూడ, విప్రో సర్కిల్, వేవ్‌రాక్, త్రిపుల్‌ఐటీ క్రాస్రోడ్మీదుగా లింగంపల్లి చేరుకుంటాయని గ్రేటర్‌ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్డైరెక్టర్వినోద్కుమార్తెలిపారు.
216డబ్ల్యూ/300 నంబర్‌తో సోమవారం నుంచి అందుబాటులో ఉంటాయన్నారు. లింగంపల్లి నుంచి ఎన్జీఓ కాలనీకి మొదటి బస్ఉదయం 5.45 గంటల బయలుదేరుతుందని, ఆఖరి బస్సు రాత్రి 7గంటలకు ఉంటుందని చెప్పారు. ఈ రూట్లో ప్రతి అరగంటకు ఒక బస్సు తిరుగుతుందని వెల్లడించారు.