పీరియడ్స్ .. ఇప్పటికీ సమాజంలో దానిపై ఓ రకమైన అపోహలున్నాయి. కనీసం బయటకు చెప్పుకోలేని పరిస్థితి. ఆ పరిస్థితిని మార్చేందుకు ఎంతో మంది ఎన్నో రకాలుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయినా కూడా ఆ అపోహ నుంచి బయటపడుతున్నది కొందరే. ఇప్పుడు ఆ అపోహలను తొలగించేందుకు మరింత ముందడుగు పడేలా ‘పీరియడ్ ఎమోజీ’ వచ్చింది. రక్తపు బొట్టుతో ఆ ఎమోజీని సృష్టించారు.
ఈ ఏడాది మార్చి నుంచే అన్ని స్మార్ట్ఫోన్లలోనూ ఆ ఎమోజీ చేరబోతోంది. పీరియడ్స్ టైంలో భావాలను పంచుకునేలా ఆ ఎమోజీని రూపొందించారు. బ్రిటన్ లోని ప్లాన్ ఇంటర్నేషనల్ యూకే సంస్థ నిర్వహించిన ప్రచారంలో ఈ రక్తపు చుక్క ఎమోజీకి 55 వేల మంది మద్దతు ప్రకటించారు. దానిని యూనికోడ్ లో అభివృద్ధి చేసి ఫోన్లలో ప్రవేశపెట్టనున్నారు. దానిని స్వాగతించేవారున్నా కొందరు మాత్రం విమర్శిస్తున్నా రు. పీరియడ్ ను రక్తంతో నే చూపించాలా అని ప్రశ్నిస్తున్నారు. శానిటరీ నాప్కి న్స్ ను పెడితే ఇంకా బాగుండేది కదా అని సూచిస్తున్నా రు.
ఇక, పీరియడ్ ఎమోజీ సహా కొత్తగా 270 ఎమోజీలు ఫోన్లలో చేరబోతున్నాయి. ఎమోజీపీడియా జాబితాలో వాటిని విడుదల చేశారు. యాపిల్ సంస్థ కొత్త ఎమోజీలకు సంబంధించి ఎప్పుడో రిక్వె స్ట్ పెట్టింది. ఈ కొత్త ఎమోజీల్లో దివ్యాంగులకు సంబంధించిన గుర్తులూ ఉన్నా యి. వీల్ చైర్లు, అంధులు, సైగల భాష, వినికిడి యంత్రాలు తదితర ఎమోజీలున్నాయి. ఇంట్లో వాడే వంటకపు వస్తువులు, వైద్య పరికరాలు, దీపాలు ఇలా ఎన్నో రకాల ఎమోజీలను ప్రవేశపెడుతున్నా రు. మొత్తానికి 2014 తర్వాత చేస్తున్న ఆరో ఎమోజీ అప్ డేట్ ఇది.