నిజామాబాద్‌అర్బన్, వెలుగు: గడపగడపకు బీజేపీ కార్యక్రమంతో కార్యకర్తల్లో కొత్త జోష్ వచ్చిందని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్ పాల్సూర్యనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని 10వ డివిజన్లో నిర్వహించిన గడపగడపకు బీజేపీ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ విజయాలను, బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లినట్లు తెలిపారు.
నందిపేట: ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి మాటలకే పరిమితమైందని గానీ, చేతల్లో కనిపించడం లేదని, ఈ విషయమై చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఆర్మూర్ బీజేపీ నాయకులు పైడి రాకేశ్‌రెడ్డి అధికార పార్టీ లీడర్లకు సవాలు విసిరారు. శుక్రవారం మండలంలోని మారంపల్లిలో ఇంటింటికీ తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. గ్రామంలో అర్హులైన మహిళలకు పెన్షన్లు రాక, సొంత ఇళ్లు లేని వాళ్లు నానా అవస్థలు పడుతున్నారన్నారు. మండలాధ్యక్షుడు భూతం సాయరెడ్డి, ఆర్మూర్బీజేపీ అసెంబ్లీ కన్వీనర్పాలెపు రాజు తదితరులు పాల్గొన్నారు.
ఎడపల్లి: ఇంటింటికీ బీజేపీ కార్యక్రమంలో భాగంగా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డీ మోహన్‌రెడ్డి శుక్రవారం ఎడపల్లిలో ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందజేస్తున్న సంక్షేమ ఫలాలను బీఆర్ఎస్ ప్రభుత్వం తామే ఇస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటుందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గద్దె దించేందుకు ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ బోధన్ అసెంబ్లీ కన్వీనర్ కురెళ్ల శ్రీధర్, లీడర్లు పాల్గొన్నారు.