
ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున (మార్చి 14) హోలీ పండుగగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం హోలీ పండుగ మార్చి 14న జరుపుకోవడానికి దేశ వ్యాప్తంగా ప్రజలు రెడీ అవుతున్నారు. శ్రీ కృష్ణుడి జన్మించిన మధుర... నడయాడిన బృందావనం ప్రాంతంలో జరిగే హోలీ వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. అయితే భారతదేశంలోని ఒక గ్రామంలో హోలీ పండుగను వింతగా జరుపుకుంటారు. ఈ విషయం తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఈ రోజు హోలీని వింతగా జరుపుకునే ఈ గ్రామం గురించి తెలుసుకుందాం..
దేశవ్యాప్తంగా ప్రజలు హోలీసంబరాలకు రడీ అవుతున్నారు.మార్చి 14న రంగులు కొనేందుకు తయారవుతున్నారు. ఇప్పటినుంచే రంగుల పండుగ సెలబ్రేషన్స్ చేసుకోవడడానికి సిద్దం చేసుకుంటున్నారు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా హోలీ పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా సంబరాలు చేసుకుంటారు. అయితే మహారాష్ట్రలోని బీడ్ జిల్లా... విడా గ్రామంలో హోలీ పండుగ రోజు వింత ఆచారాన్ని పాటిస్తారు. కొత్త అల్లుడిని గాడిదపై ఆ గ్రామంలో ఊరేగిస్తారు.
మహారాష్ట్రలో బీడ్ జిల్లా విడా గ్రామంలో హోలీ చాలా ప్రత్యేకమైనది. హోలీ రోజున ఈ గ్రామంలో కొత్త అల్లుడిని గాడిదపై కూర్చోబెట్టి గ్రామం మొత్తం చుట్టి తిప్పే సంప్రదాయం ఉంది. ఈ గ్రామ ప్రజలు 86 సంవత్సరాలుగా ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఈ గ్రామంలో కొత్త అల్లుడిని ఎంపిక చేసి తర్వాత హోలీ రోజున ఊరేగింపుని మొదలు పెడతారు.
ALSO READ | మార్చి 10 అమలక ఏకాదశి: శ్రీహరిని పూజించిన శ్రీకృష్ణుడు.. ఏ వస్తవులు దానం చేశాడో తెలుసా..
కొత్త అల్లుడిని హోలీ రోజున ఇంటికి రమ్మని ఆహ్వానిస్తారు. హోలీ రోజున కొత్త అల్లుడిని గాడిదపై కూర్చోబెడతారు. తరువాత రంగు వేస్తారు. దీని తరువాత గాడిదపై ఉన్న అల్లుడిని గ్రామం మొత్తం చుట్టి తీసుకువెళతారు. ఊరి ప్రజలు కొత్త అల్లుడికి రకరకల బహుమతులు ఇస్తారు. విడా గ్రామంలో జరిగే ఈ ప్రత్యేకమైన హోలీని, గాడిదపై స్వారీ చేసే అల్లుడిని చూడటానికి సమీప ప్రాంతాల నుంచి మాత్రమే కాదు దూర ప్రాంతాల నుంచి కూడా భారీ సంఖ్యలో ప్రజలు వస్తారు.
వింత ఆచారం ఎందుకంటే..
స్థానిక ప్రజల అభిప్రాయం ప్రకారం దాదాపు 86 సంవత్సరాల క్రితం బీడ్ జిల్లాలోని విడా గ్రామంలో దేశ్‌ముఖ్ కుటుంబం నివసించేది. హోలీ రోజున దేశ్‌ముఖ్ కుటుంబం కుమార్తె, అల్లుడు ఇంటికి వచ్చారు. అల్లుడు రంగులు పూసుకుని హోలీ ఆడటానికి నిరాకరించాడు. దీని తరువాత మామగారు తన అల్లుడిని అనేక విధాలుగా చెప్పి అల్లుడు అంగీకరించిన తర్వాత మామగారు పూలతో అలంకరించబడిన ఒక గాడిదను తెచ్చి, అల్లుడిని దానిపై కూర్చోబెట్టి గ్రామం మొత్తం చుట్టి తీసుకెళ్తూ చాలాసార్లు హోలీ ఆడారు.
ఈ సంప్రదాయాన్ని ఆనందరావు దేశ్‌ముఖ్ అనే వ్యక్తి ప్రారంభించాడని నమ్ముతారు. గ్రామంలో అతనికి గొప్ప గౌరవం ఉండేది. ఈ సంప్రదాయాన్ని ఆనందరావు అల్లుడు ప్రారంభించాడు. అప్పటి నుంచి ఈ సంప్రదాయం అలాగే కొనసాగుతోంది. ఈ సంప్రదాయంలో కొత్త అల్లుడికి గ్రామస్తులు అనేక రకాల బహుమతులతో పాటు, అల్లుడికి నచ్చిన బట్టలు కూడా ఇస్తారు