నిజామాబాద్ సిటీ, వెలుగు: నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు శశిధర్ రెడ్డి, అరవింద్ కుమార్ తెలిపారు. అధ్యక్షులుగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, ఉపాధ్యక్షులుగా సీపీ కల్మేశ్వర్, అడిషనల్ కలెక్టర్ యాదిరెడ్డిలతో పాటు టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాహెర్ బిన్ హందాన్,సెక్రటరీగా చిల్వేరి సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీగా కె.వెంకట రాములు, ట్రెజరర్ గా రిటైర్డ్ ఎస్టీవో బి.గంగాకిషన్ ఎన్నికయ్యారు.
ఆఫీసర్స్ క్లబ్ ఉపాధ్యక్షులు తాహెర్ బిన్ హందాన్ మాట్లాడుతూ 70 ఏండ్ల చరిత్ర ఉన్న క్లబ్ ను మాజీ మంత్రి, బోధన్ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి సహకారంతో ఇతర ప్రాంతానికి తరలించకుండా కాపాడుకుంటామన్నారు. క్లబ్ ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు క్రీడా పోటీల నిర్వహణకు తోడ్పడతామని క్లబ్ సెక్రటరీ చిల్వెరు సత్యనారాయణ పేర్కొన్నారు.