ఇవాల్టి(ఫిబ్రవరి 17, 2025) నుంచి.. అమల్లోకి 2 కొత్త ఫాస్టాగ్ రూల్స్‌.. టోల్ ట్రాన్సాక్షన్ ప్రాసెస్‌‌‌‌‌‌‌‌లోనే ఉంటే..

ఇవాల్టి(ఫిబ్రవరి 17, 2025) నుంచి.. అమల్లోకి 2 కొత్త ఫాస్టాగ్ రూల్స్‌.. టోల్ ట్రాన్సాక్షన్ ప్రాసెస్‌‌‌‌‌‌‌‌లోనే ఉంటే..

న్యూఢిల్లీ: ఫాస్టాగ్ రూల్స్‌‌‌‌‌‌‌‌ను ప్రభుత్వం కఠినతరం చేసింది. తక్కువ బ్యాలెన్స్  ఉన్నా, పేమెంట్స్ ఆలస్యం చేసినా లేదా బ్లాక్‌‌‌‌‌‌‌‌లిస్ట్‌‌‌‌‌‌‌‌లో ఉన్న ట్యాగ్స్‌‌‌‌‌‌‌‌ కోసం రెండు కొత్త రూల్స్‌‌‌‌‌‌‌‌ను తీసుకొచ్చింది. సోమవారం నుంచి ఇవి అమల్లోకి వస్తాయి. టోల్‌‌‌‌‌‌‌‌ గేట్ దాటక ముందు గంట, దాటిన తర్వాత 10 నిమిషాల పాటు ఫాస్టాగ్ యాక్టివ్‌‌‌‌‌‌‌‌గా లేకపోతే  ట్రాన్సాక్షన్‌‌‌‌‌‌‌‌ పూర్తికాదు. ఎర్రర్ కోడ్‌‌‌‌‌‌‌‌ 176 పేరుతో ట్రాన్సాక్షన్ ఆగిపోతుంది. టోల్‌‌‌‌‌‌‌‌ రీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దాటిన 15 నిమిషాల తర్వాత కూడా టోల్ ట్రాన్సాక్షన్ ప్రాసెస్‌‌‌‌‌‌‌‌లోనే ఉంటే  సంబంధిత ఫాస్టాగ్ యూజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అదనపు ఛార్జీలు పడతాయి.

నేషనల్‌‌‌‌‌‌‌‌  ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్‌‌‌‌‌‌‌‌ (ఎన్‌‌‌‌‌‌‌‌ఈటీసీ)  గైడ్‌‌‌‌‌‌‌‌లైన్స్ ప్రకారం, ఒక ట్రాన్సాక్షన్ ఆలస్యమైనా, యూజర్ ఫాస్టాగ్ అకౌంట్‌‌‌‌‌‌‌‌లో సరిపడినంత బ్యాలెన్స్ లేకపోయినా టోల్ ఆపరేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దే బాధ్యత. కానీ, ఫాస్టాగ్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయితే  15 రోజుల కూలింగ్ పీరియడ్ తర్వాతనే ఈ ఛార్జ్‌‌‌‌‌‌‌‌పై యూజర్లు ఫీర్యాదు చేయాలి. ట్రాన్సాక్షన్   రిజెక్ట్ కాకుండా ఉండాలంటే యూజర్లు సరిపడినంత బ్యాలెన్స్‌‌‌‌‌‌‌‌ను ఫాస్టాగ్ అకౌంట్‌‌‌‌‌‌‌‌లో మెయింటైన్ చేయాలి.