ఆగస్ట్‌ 1 నుంచి ఫాస్టాగ్‌ కొత్త రూల్స్.. అవేంటో ఓ లుక్కేయండి..!

ఆగస్టు 1 నుంచి ఫాస్టాగ్ సర్వీసులపై కొత్త రూల్స్ అమలు కానున్నాయి. ప్రస్తుతం వాహనం కొనుగోలు చేసిన తర్వాత 90 రోజుల్లోపు వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఫాస్టాగ్ నంబర్‌లో అప్‌లోడ్ చేయాలి. లేనిచో ఆ వాహనం హాట్‌లిస్ట్‌లో ఉంటుంది. హాట్ లిస్ట్ లో చేరిన తర్వాత30 రోజులు గడువు ఇస్తారు. అప్పుడు కూడా వాహనం నంబర్‌ను అప్‌డేట్ చేయకపోతే ఫాస్టాగ్ బ్లాక్‌లిస్ట్ ఆ వాహనాన్ని బ్లాక్ లిస్ట్ లో పెడుతుంది.  ఐతే తాజాగా వచ్చిన నిబంధన ప్రకారం ఫాస్టాగ్ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీలు అక్టోబర్ 31 లోపు మొత్తం ఐదు, మూడు సంవత్సరాల ఫాస్టాగ్‌ల కేవైసీ చేయాల్సి ఉంటుంది.

అక్టోబర్ 31 వరకు సమయం

జూన్‌లో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫాస్టాగ్‌కి సంబంధించి గైడ్ లైన్స్ జారీ చేసింది. ఫాస్టాగ్ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీలు  కొత్త ఫాస్టాగ్‌ని జారీ చేయడం, సెక్యూరిటీ డిపాజిట్, కనీస రీఛార్జ్‌ని తదితర అంశాలను మారిన నిబంధనల ప్రకారం జారీ చేయడానికి ఆగస్టు 1 తేదీని నిర్ణయించింది. ఇప్పుడు కంపెనీలకు అన్ని షరతులను నెరవేర్చడానికి ఆగస్టు 1 నుండి అక్టోబర్ 31 వరకు సమయం ఉంటుంది. 

కొత్త షరతుల ప్రకారం.. 

* కంపెనీలు ఐదేళ్ల పాత ఫాస్టాగ్‌ని ప్రాధాన్యతా ప్రాతిపదికన భర్తీ చేయాలి
*  మూడేళ్ల ఫాస్టాగ్‌ని తిరిగి కేవైసీ చేయాలి
*  వాహన రిజిస్ట్రేషన్ నంబర్, ఛాసిస్ నంబర్‌ను ఫాస్టాగ్‌కు లింక్ చేయాలి
*  కొత్త వాహనాన్ని కొనుగోలు చేసిన తర్వాత దాని నంబర్‌ను 90 రోజులలోపు అప్‌డేట్ చేయాలి
*  వాహన డేటాబేస్‌ను ఫాస్టాగ్ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీలు ధృవీకరించాలి
*  కేవైసీ చేస్తున్నప్పుడు వాహనంఫోటోలను స్పష్టంగా తీసి అప్‌లోడ్ చేయాలి
*  మొబైల్ నంబర్‌కు లింక్ చేయడానికి ఫాస్టాగ్ తప్పనిసరి
*  కేవైసీ ధృవీకరణ ప్రక్రియ కోసం యాప్, వాట్సాప్‌, పోర్టల్ వంటి సేవలు అందుబాటులో ఉంచాలి
*  కంపెనీలు 31 అక్టోబర్ 2024లోపు కేవైసీ నిబంధనలను పూర్తి చేయాల్సి ఉంటుంది