FD Rules 2025: ఫిక్స్డ్​ డిపాజిట్లపై కొత్త రూల్స్..డిపాజిటర్లు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

 FD Rules 2025:  ఫిక్స్డ్​ డిపాజిట్లపై కొత్త రూల్స్..డిపాజిటర్లు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

పొదుపు చేయాలని అందరికీ ఉంటుంది.. అలాంటి వారికోసం పొదుపు చేసేందుకు అనేక మార్గాలు ఉన్నాయి.. తక్కువ టర్మ్​..ఎక్కువ రిటర్న్స్​ వచ్చే మార్గాల కోసం చూస్తుంటాం. ఇటువంటి వాటిలో ఫిక్స్డ్​ డిపాజిట్లు(FD) ఒకటి.. అయితే ఫిక్స్​ డ్​ డిపాజిట్లు చేసే ముందు వాటి రూల్స్​ గురించి తెలుసుకోవడం మంచిది..2025 లో FDలపై కొత్త రూల్స్​వచ్చాయి.  వాటి గురించి తెలుసుకుందాం. 

ఫిక్స్డ్​ డిపాజిట్​ చేసేవారికి రిజర్వ్​ బ్యాంక్​ఆఫ్ ఇండియా రూల్స్​ సవరించింది. కొత్త రూల్స్​ జనవరి 1,2025 నుంచి అమలులోకి వచ్చాయి. హౌసింగ్ ఫైనాన్స్ కంపె నీలు (HFCలు), నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (NBFCలు) డిపాజిటర్లకు సేవలను మరింత సులభతరం చేసేందుకు ఈ కొత్తరూల్స్​ తీసుకొచ్చారు.  సవరించిన FD రూల్స్​ ఇవే.. 

చిన్న డిపాజిట్లు:

కొత్త రూల్స్​ ప్రకారం.. డిపాజిటర్లు రూ. 10వేల లోపు డిపాజిట్లనుంచి మొత్తం అమౌంట్ ను డ్రా చేసుకోవచ్చు.. డిపాజిట్​ చేసిన మూడునెలల తర్వాత డ్రా చేసుకో వచ్చు.  అయితే ఈ మొత్తానికి వడ్డీ చెల్లింపులు ఉండవు. 

పెద్ద డిపాజిట్లు.. 

పదివేల కంటే ఎక్కువ మొత్తం ఉన్న డిపాజిట్ల నుంచి మూడే నెలల్లో 50 శాతం వరకు ,లేదా 5లక్షల వరకు డ్రా చేసుకోవచ్చు. స్మాల్​ డిపాజిట్ల మాదిరిగానే ఈ మొత్తా నికి కూడా వడ్డీ ఉండదు. 

అనారోగ్యంగా ఉన్నపుడు .. 

ఒకవేళ డిపాజిటర్​అనారోగ్యం ఉన్నపుడు డిపాజిట్​టర్మ్​ తో సంబంధం లేకుండా మొత్తం అమౌంట్​ను ముందుగానే డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అయితే ఈ అమౌంట్​ కు ఎలాంటి వడ్డీ చెల్లింపులు ఉండవు. ఇది ఇంతకుముందే డిపాజిటర్లకు.. ప్రస్తుతం డిపాజిట్​ చేసే వారికి వర్తిస్తుంది.