ఆరోగ్యసేతులో కొత్త ఫీచర్

ఆరోగ్యసేతులో కొత్త ఫీచర్

కోవిడ్ నుంచి మ‌న‌ల్ని మ‌నం రక్షించుకునేందుకు వీలుగా రూపొందించిన ఆరోగ్య‌సేతు యాప్ లో మ‌రో కొత్త ఫీచ‌ర్ వ‌చ్చింది. ఓపెన్ ఏపీఐ అనే కొత్త స‌ర్వీస్ ను తీసుకొచ్చింది. దీని ద్వారా సంస్థ‌లు..త‌మ ఉద్యోగులు, వ్యాపార నిమిత్తం వ‌చ్చే ఇత‌ర వ్య‌క్తుల యొక్క ఆరోగ్య వివ‌రాల‌ను తెలుసుకోవ‌చ్చు. అయితే దీనివ‌ల్ల వ్య‌క్తిగ‌త గోప్య‌త‌కు ఎటువంటి భంగం వాటిల్ల‌ద‌ని యాప్ క్లారిటీ ఇచ్చింది. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు ఈ యాప్ ను 15 కోట్ల మందికి పైగా వాడుతుండ‌టం తెలిసిందే.