త్వరలో గూగుల్ క్రోమ్‌లో కొత్త ఫీచర్‌

త్వరలో గూగుల్ క్రోమ్‌లో కొత్త ఫీచర్‌

గూగుల్ క్రోమ్.. ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు ఎక్కువగా ఉపయోగించే వెబ్ బ్రౌజర్. కేవలం పర్సనల్ కంప్యూటర్స్ కు  మాత్రమే కాకుండా..మొబైల్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. తాజాగా గూగుల్ సంస్థ ఈ క్రోమ్ బ్రౌజర్ లో ఓ కొత్త ఫీచర్‌ను తీసుకొనివస్తునట్టు సమాచారం. క్రోమ్ నెమ్మదిగా లోడ్‌ అయ్యే వెబ్‌సైట్‌లను గుర్తించేందుకు గూగుల్‌ ప్రణాళికలు వేస్తోంది.

అలాంటి వాటిని బ్రౌజింగ్‌ చేసేటప్పుడు క్రోమ్‌లో ప్రత్యేక లేబుల్‌ చూపించే ప్రయత్నం చేస్తోంది. ఈ విషయాన్ని క్రోమ్‌ డెవలప్‌మెంట్‌ టీం తమ బ్లాగ్‌లో తెలిపింది. అయితే, ఏ కారణం వల్ల సైట్‌ నెమ్మదిగా లోడ్‌ అవుతుందో తెలిపేందుకు కూడా క్రోమ్‌ బృందం ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు డివైజ్‌ హార్డ్‌వేర్‌ లేక నెట్‌వర్క్‌ కనెక్టివిటీలో ఏదైనా సమస్య ఉందో లేబుల్‌ ద్వారా తెలిపేలా డెవలప్ చేస్తునట్టు బ్లాగ్‌లో చెప్పింది.