వాట్సాప్ లో కొత్త ఫీచర్..!

వాట్సాప్ లో కొత్త ఫీచర్..!

ప్రతి ఒక్కరు ఎక్కువగా వాడే యాప్స్ లో కచ్చితంగా ఉంటుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. మొదట మెసేజ్ చేసుకోవటానికి మాత్రమే వీలున్న ఈ యాప్ ఆ తర్వాత ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ ని తీసుకొస్తూ ఉంది. తాజాగా వచ్చిన అప్డేట్లో మన చాట్ ని డేట్ ప్రకారం సర్చ్ చేసుకునే వెసలుబాటు కల్పించింది. ఇంతకాలం మనం పాత చాట్ ఏదైనా వెతుక్కోవాలంటే చాట్ మొత్తం స్క్రోల్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ అప్డేట్ తో డేట్ ఎంటర్ చేసి సర్చ్ చేస్తే చాలు ఆ డేట్ కి సంబందించిన చాట్ మనం చూడచ్చు. 

ఇటీవల రిలీజ్ చేసిన ఈ అప్డేట్ ఆండ్రాయిడ్, IOS, మ్యాక్, విండోస్, వెబ్ వంటి అన్ని వర్షన్లకు వర్తిస్తుందని సంస్థ తెలిపింది. ఈ ఫీచర్ మీ ఫోన్లో అప్డేట్ అయ్యిందో లేదో చూడాలంటే ఏదైనా చాట్ ఓపెన్ చేసి ఆప్షన్స్ లోకి వెళ్తే సార్క్ ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే పై భాగంలో సర్చ్ బార్ ఓపెన్ అవుతుంది. ఆ సర్చ్ బార్లో ,మనకు కావాల్సిన డేట్ ను ఎంటర్ చేసి కావాల్సిన చాట్ ను చూడచ్చు.

ALSO READ :- లాస్య నందిత కారు ప్రమాదం.. లారీ డ్రైవర్ ఇతనే..

వాట్సాప్ కొత్తగా తెచ్చిన ఈ అప్డేట్ తో యూజర్స్ కి ఎండ్ టు ఎండ్ స్క్రోల్ చేసే బాధ తప్పినట్టే అని చెప్పాలి. అంతే కాకుండా క్యూఆర్ కోడ్ ని ఈజీగా షేర్ చేసే విధంగా మరొక అప్డేట్ తేనున్నట్లు వాట్సాప్ తెలిపింది. ఈ క్యూఆర్ కోడ్ అప్డేట్ ద్వారా యూజర్స్ నంబర్ తో పని లేకుండా తమ కాంటాక్ట్ ని షేర్ చేయచ్చని తెలిపింది.