క్లబ్‌హౌజ్‌లో డైరెక్ట్ మెసేజ్‌లు
లేటెస్ట్ సెన్సేషన్.. ఆడియో ఓన్లీ యాప్ ‘క్లబ్‌హౌజ్’లో కొత్త ఫీచర్ యాడ్ అయింది. ‘బ్యాక్‌ఛానెల్’ పేరుతో వచ్చిన కొత్త ఫీచర్ ద్వారా యూజర్స్ ఇకపై డైరెక్ట్ మెసేజ్‌లు పంపుకోవచ్చు. వన్–టు–వన్ లేదా గ్రూప్ టెక్స్ట్ చాట్ చేసుకునే ఫీచర్ ఇది. డిస్కషన్ రూమ్‌లో ఆడియో వింటూనే, మరొకరితో చాట్ చేయొచ్చు. స్పీకర్, లిజనర్.. ఎవరైనా మెసేజ్‌లు చేయొచ్చు. స్పీకర్స్, కో–హోస్ట్‌తో చాట్ చేస్తూ, లిజనర్స్ నుంచి ప్రశ్నలు తీసుకుని, ఆన్సర్ చేయొచ్చు. కొత్త అప్‌డేట్ ద్వారా ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్స్ అందరూ ఈ ఫీచర్ వాడుకోవచ్చు. యాప్‌లో ఏరోప్లేన్ ఐకన్‌పై ట్యాప్ చేయడం ద్వారా లేదా చాట్ త్రెడ్‌పై లెఫ్ట్ స్వైప్ చేయడం ద్వారా చాట్ మొదలుపెట్టొచ్చు. యూజర్స్ ఫాలో అయ్యే వాళ్ల మెసేజ్‌లు మెయిన్‌ట్యాబ్‌లో కనిపిస్తే, ఫాలో అవ్వనివాళ్ల మెసేజ్‌లు సెపరేట్ ఇన్‌బాక్స్‌లో కనిపిస్తాయి. ఇప్పటికే వాట్సాప్ వంటి మెసేజింగ్ యాప్స్‌కు గట్టి పోటీ ఇస్తున్న ‘క్లబ్‌హౌజ్’ తెచ్చిన ఈ అప్‌డేట్‌తో, వాటికి మరింత పోటీ ఉంటుందని అనలిస్ట్‌లు అంటున్నారు.
ఇన్‌స్టాలో కొత్త సెక్యూరిటీ టూల్
ఫొటో అండ్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ ‘ఇన్‌స్టాగ్రామ్’ కొత్త సెక్యూరిటీ చెకప్ టూల్‌ను తీసుకొచ్చింది. ఇది యూజర్ల అకౌంట్‌కు మరింత సెక్యూరిటీని అందిస్తుందని కంపెనీ చెప్పింది. దీనిద్వారా హ్యాకింగ్‌కు గురైన లేదా హ్యాక్ అయ్యే అవకాశం ఉన్న అకౌంట్స్ యూజర్స్‌ను గైడ్ చేస్తుంది. లాగిన్ యాక్టివిటీ, రివ్యూయింగ్ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్, కన్ఫర్మింగ్ అకౌంట్ ద్వారా అకౌంట్ రికవర్ అయ్యేందుకు ఈ ఫీచర్ పనికొస్తుంది. ఫోన్ నెంబర్, ఇ–మెయిల్ ఐడీ ద్వారా యూజర్స్ అకౌంట్‌ను రికవర్ చేసుకోవచ్చు. యూజర్స్ తమ అకౌంట్ సేఫ్‌గా ఉండాలంటే టు–ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎనేబుల్ చేసుకోవాలి. ఏయే డివైజ్‌ల నుంచి లాగిన్ అయ్యారో చూసుకోవాలి. ఇన్‌స్టాగ్రామ్ పేరుతో కంపెనీ నుంచి ఎలాంటి డైరెక్ట్ మెసేజ్‌లు రావు. అందువల్ల ఇన్‌స్టాలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవద్దు. ఏదైనా అప్‌డేట్ ఉంటే మెయిల్ లేదా మొబైల్ నెంబర్‌కు మాత్రమే మెసేజ్ వస్తుందని గుర్తుంచుకోవాలి. త్వరలో వాట్సాప్‌తో కూడా ఇన్‌స్టాగ్రామ్‌ను లింక్ చేసుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌కు సంబంధించిన యాక్టివిటీని వాట్సాప్‌లో కూడా చూడొచ్చు. అకౌంట్‌ను కూడా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఈ అప్‌డేట్ త్వరలో వస్తుంది.
‘గూగుల్‌మీట్’ యాప్‌లో
‘గూగుల్‌మీట్’ యాప్‌లో గ్రూప్ వీడియో కాల్స్ ఫ్రీగా చేసుకోవచ్చనేది తెలిసిందే. ఈ కాల్స్ ఎంతసేపైనా చేసుకునే అవకాశం ఇప్పటివరకు ఉండేది. అయితే, గూగుల్ ఇప్పుడు ఈ ఫీచర్‌ను అప్‌డేట్ చేసింది. ఇకపై ఫ్రీ యూజర్స్ 60 నిమిషాల వరకు మాత్రమే గ్రూప్ కాల్స్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కాల్ ఆటోమేటిక్‌గా కట్ అయిపోతుంది. 55వ నిమిషంలో దీనికి సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది. గూగుల్ అకౌంట్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాలి. అప్పుడే అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. ముగ్గురు లేదా అంతకంటే ఎక్కుమంది యూజర్స్ ఉంటే ‘గూగుల్‌మీట్’లో గ్రూప్ వీడియో కాల్స్ చేసుకోవచ్చు. ఇందులో వందమందితో మాట్లాడొచ్చు. ఈ ఫీచర్ రోజంతా అందుబాటులో ఉంటుంది. అయితే, అన్‌లిమిటెడ్ కాల్స్ కావాలంటే సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి.
మల్టీడివైజ్ సపోర్ట్‌తో వాట్సాప్
వాట్సాప్ యూజర్స్ చాలాకాలంగా ఎదురుచూస్తున్న మల్టీడివైజ్ సపోర్ట్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. అయితే, ఇది లిమిటెడ్ బీటా యూజర్స్‌కు మాత్రమే! ఈ ఫీచర్ ద్వారా రెగ్యులర్‌గా వాట్సాప్ వాడే స్మార్ట్‌ఫోన్‌తోపాటు, మరో నాలుగు డివైజ్‌లపై ఒకేసారి కనెక్ట్ కావొచ్చు. ఇప్పటికే ఇలాంటి ఫీచర్ ఒకటి ఉంది. అది స్మార్ట్‌ఫోన్ ద్వారా ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్‌పై లాగిన్ అయ్యే ఫీచర్. అయితే, దీనిద్వారా వాట్సాప్ వాడాలంటే స్మార్ట్‌ఫోన్ ఎప్పుడూ నెట్‌తో కనెక్టై ఉండాలి. ఒకవేళ స్మార్ట్‌ఫోన్‌లో నెట్ లేకపోతే, కొద్దిసేపటి తర్వాత వాట్సాప్ ఆటోమేటిక్‌గా లాగవుట్ అయిపోతుంది. అయితే, కొత్తగా వచ్చిన మల్టీడివైజ్ సపోర్ట్ ఫీచర్‌తో ఇలా ఫోన్‌తో కనెక్ట్ కావాల్సిన పనిలేదు. వేరువేరు డివైజ్‌లపై వేరుగా వాట్సాప్ వాడొచ్చు. ప్రస్తుతం ఇది కొందరికి మాత్రమే అందుబాటులో ఉంది. రెగ్యులర్ వెర్షన్ కాకుండా, బీటా వెర్షన్ వాడేవాళ్లు మాత్రమే ఈ ఫీచర్ ఉపయోగించుకోవచ్చు. ఈ ఫీచర్ త్వరలోనే అందరికీ అందుబాటులోకి వస్తుంది.