వ్యక్తిగత విషయాల గురించి పర్సన్ చాటింగ్ చేస్తున్నప్పుడో లేదా అధికారులతో ముఖ్యమైన విషయాలపై కాన్ఫిడెన్షియల్ చాటింగ్ చేస్తున్నప్పుడో ఆ మెసేజ్‌లను ఎవరైనా చూస్తారనే భయం ఉంటుంది. కొంతమంది యాప్ లాక్ పెట్టుకోవడం లేదా మెసేజెస్ ఎప్పటికప్పుడు డిలీట్ చేయడం చేస్తుంటారు. ఇలాంటి వారి కోసం వాట్సాప్ కొత్త ఫీచర్ తీసుకొస్తోంది.
వాట్సాప్‌లో పంపే మెసేజ్ ఎప్పుడు డిలీట్ కావాలో ముందే డిసైడ్ చేసుకోవచ్చు. ‘సెల్ఫ్ డిస్ట్రక్టింగ్ మెసేజ్ ’ పేరుతో కొత్త ఫీచర్ ను త్వరలోనే తీసుకురానుంది వాట్సాప్ . ఈ ఫీచర్‌లో సెలెక్ట్ చేసుకున్న టైమ్‌కు మెసేజ్ దానికదే డిలీట్ అవుతుంది. ప్రైవసీ కోరుకునే యూజర్లకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.
అప్పటికప్పుడు.. గంటకు.. రోజు.. వారం.. ఇలా ఆప్షన్
ఎవరికైనా ‘వాట్సాప్ ’లో ఒక మెసేజ్ పంపితే దాన్ని వెంటనే డిలీట్ చేయాలంటే ‘డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ’ ఆప్షన్ ఉంది. అయితే అదే మెసేజ్ దానికదే ఎప్పుడు డిలీట్ కావాలో కూడా సెండ్ చేసే ముందే డిసైడ్ చేయొచ్చు. ఇదే ‘సెల్ఫ్ డిస్ట్రక్టింగ్ మెసేజ్ ’ ఫీచర్ . కొంతకాలం నుంచి ఈ ఫీచర్ పై ‘వాట్సాప్ ’ పని చేస్తోంది. ప్రస్తుతం 2.19.348 వెర్షన్ వాడుతున్న కొందరికి మాత్రం ప్రయోగాత్మకంగా అందుబాటులోకి వచ్చిం ది. త్వరలోనే అందరికీ ఈ ఆప్షన్ కనిపిస్తుంది.
MORE NEWS:
షీ టీమ్ నంబర్ ఇదే.. మన బిడ్డలకు చెప్పండి
నిద్రపోవడమే జాబ్.. జీతం లక్ష: ఇండియన్స్ అంతా అప్లై చేసుకోవచ్చు
మెసేజ్ పంపే ముందే అది ఎప్పటికీ ఉండాలా.. లేక కొంతకాలం తర్వాత డిలీట్ కావాలా అనేది యూజర్లు డిసైడ్ చేసుకోవచ్చు. మెసేజ్ పంపే ముందే సెట్టింగ్స్‌లో ఈ ఆప్షన్ సెట్ చేసుకోవచ్చు. దీనిలో ‘ఆఫ్, 1 అవర్ , 1 డే, 1 వీక్, 1 మంత్, 1 ఇయర్’ అనే ఆప్షన్స్ ఉంటాయి. వీటిలో ఆఫ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ మెసేజ్ ఎప్పటికీ ఉంటుంది. లేదా మిగతా ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటే, ఆ టైమ్ పూర్తికాగానే మెసేజ్ దానికదే డిలీట్ అవుతుం ది. ప్రైవసీ కోరుకునే వాళ్లకు ఇది బాగా ఉపయోగపడుతుం ది. ఈ ఫీచర్ యాపిల్‌కంటే ముందుగా ఆండ్రాయిడ్ ఫోన్లలోకి వస్తుంది. గ్రూప్స్‌లో అడ్మిన్స్ ఈ ఫీచర్ ను యాక్టివేట్ చేసుకోవచ్చు.
ఒకేసారి వేర్వేరు ఫోన్లలో లాగిన్
డెడ్‌లైన్ ఫీచర్‌తో పాటు ‘క్యూఆర్ కోడ్ ’ అనే మరో ఫీచర్ కూడా త్వరలో వస్తుంది వాట్సాప్. ఎవరి నెంబరైనా వాట్సాప్ లో సేవ్ చేసుకోవాలనుకుంటే వాళ్ల నెంబర్ ను ప్రత్యేకంగా సేవ్ చేయాల్సిన అవసరం లేదు. వాట్సాప్ యూజర్ కు ఉండే ప్రత్యేక ‘క్యూఆర్ కోడ్ ’ను స్కాన్ చేసుకుంటే చాలు. ఇంకొకరికి నెంబర్ షేర్ చేయాలన్నా ఇదే కోడ్ వాడుకోవచ్చు. ఒకేసారి రెండు, మూడు డివైజ్‌లపై వాట్సాప్ లాగిన్ అయ్యే అవకాశం లేదు. డెస్క్‌టాప్‌పై మాత్రం స్కాన్ చేసి, లాగిన్ అవ్వొచ్చు. కానీ, త్వరలో ఒకే అకౌంట్ తో వేరువేరు డివైజ్ లపై ఒకేసారి లాగిన్ అవ్వగలిగే అప్ డేట్ ను కూడా తీసుకొ స్తోంది వాట్సాప్.