హైదరాబాద్, వెలుగు: ఏపీ కొత్త డీజీపీగా 1989 బ్యాచ్‌కు చెందిన ద్వారకా తిరుమలరావును నియమిస్తూ ఆ రాష్ట్ర సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్బుధవారం జీవో జారీ చేశారు. ప్రస్తుతం ఆయన పబ్లిక్ట్రాన్స్పోర్ట్కమిషనర్, ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా కొనసాగుతున్నారు. అలాగే ఏపీలో అధికారం చేపట్టిన కొత్త సర్కారు 19 మంది సీనియర్ ఐఏఎస్ లను బదిలీ చేసింది.
ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ గా సాయిప్రసాద్, సీఎం సెక్రటరీగా ప్రద్యుమ్న, సీఆర్ డీ ఏ కమిషనర్ గా కాటమనేని భాస్కర్ ను నియమించింది. గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన స్పెషల్ సీఎస్ లు శ్రీలక్ష్మి, రజత్ భార్గవ, ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్ కు పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీలో రిపోర్ట్ చేయాలని సీఎస్ ఆదేశించారు. అగ్రికల్చర్ స్పెషల్ సీఎస్ గా రాజశేఖర్, లేబర్ స్పెషల్ సీఎస్ గా గోపాలకృష్ణ ద్వివేది, పీఆర్ ఆర్డీ ప్రిన్సిపల్ సెక్రటరీగా శశిభూషణ్ కుమార్ కు పోస్టింగ్ ఇచ్చారు.