
ఆసిఫాబాద్, వెలుగు: ఇష్టం లేని పెండ్లి చేశారంటూ మనస్తాపానికి గురైన నవ వరుడు పెండ్లయిన11 రోజులకే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ సాగర్ కథనం ప్రకారం.. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం తేజా పూర్ కు చెందినవడై ఉమేశ్(27 ) కు సుర్దాపూర్ కు చెందిన యువతితో ఈనెల 5న పెండ్లి జరిగింది.
ఈ పెండ్లి ఉమేశ్ కు ఇష్టం లేదు. గురువారం పని మీద బయటకు వెళ్లిన ఉమేశ్ తన తండ్రి బాపురావుకు ఫోన్ చేసి వంకాయ తోటలో పురుగుల మందు తాగానని చెప్పాడు. దీంతో హుటాహుటిన అక్కడకు వెళ్లి టూ వీలర్‌పై ఆసిఫాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్‌కు, అక్కడి నుంచి మంచిర్యాలకు తరలిస్తుండగా చనిపోయాడు.