బిర్యానీపై GST ఇంతా..? సోషల్ మీడియాలో హాట్ హాట్ డిబేట్..కామెంట్లతో నెటిజన్ల రచ్చ

బిర్యానీపై GST ఇంతా..? సోషల్ మీడియాలో హాట్ హాట్ డిబేట్..కామెంట్లతో నెటిజన్ల రచ్చ

సోషల్ మీడియాలో ఓ పోస్ట్ రచ్చ రేపుతోంది..తిండిపైనే కూడా ఇంత జీఎస్టా..? జీఎస్టీ వేయకుండా దేన్నీ వదలరా? చిన్నపిల్లా డైపర్ నుంచి..చనిపోతే కప్పే గుడ్డ వరకు దేన్నీ వదలకుండా జీఎస్టీ వేస్తున్నారు. వెయ్యి రూపాయల విలువైన వస్తువులు కొంటే వాటిపై180 రూపాయల జీఎస్టీ వేస్తారా..అంటూ నెటిజన్లు విరుచుకు పడుతున్నారు. ఇంతకీ ఈ పోస్ట్ ఎవరు పెట్టారు.. ఎందుకు పెట్టారు.. సోషల్ మీడియా హాట్ హాట్ చర్చ జరుగుతోంది..వివరాల్లోకి వెళదాం.. 

తమిళనాడుకు చెందిన వ్యక్తి తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం Xలో ఓ పోస్ట్ చేశారు. బిర్యానీ పై జీఎస్టీ అంటూ.. మటన్, చికెన్, ఎగ్, వెజ్ ఇలా అన్ని బిర్యానీలపై వేస్తున్న జీఎస్టీ లిస్ట్ ను తన పోస్ట్ లో హైలైట్ చేశారు.జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ తర్వాత ఈ పోస్ట్ ను షేర్ చేశారు. 

ఈ పోస్ట్ లో బిర్యానీ కుస్కా పై GST 5శాతం, మటన్ బిర్యానీపై GST 12శాతం,మటన్ బిర్యాని గుడ్డుతో GST 18 శాతం, మటన్ బిర్యానీ మొగలైపై GST 28 శాతం అని పోస్ట్ లో షేర్ చేసి అచ్చే దిన్ అంటూ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. 

Also Read :- ట్రాఫిక్ చలాన్ డిస్కౌంట్లపై పోలీసుల క్లారిటీ

ఈ పోస్టుకు ప్రతిస్పందనగా ఓ నెటిజన్ ఇలా రాశారు. సాలరీ ట్యాక్స్ 30 శాతం, పెట్రోల్ ట్యాక్స్ 50 శాతం, జీఎస్టీ ట్యాక్స్ 28 శాతం, వెహికల్ ట్యాక్స్(10 కి.మీలకు టోల్ ట్యాక్స్ ) 30 శాతం, ఎడ్యుకేషన్ ట్యాక్స్ 18 శాతం, హెల్త్ పై ట్యాక్స్ 18 శాతం అని రాసి.. ఇంత చెల్లిస్తున్నా.. అంతా ఉక్కిబిక్కిరిగానే ఉంది. సౌకర్యాల్లో నిల్ అంటూ.. రైళ్లలో రద్దీని సూచించే వీడియోను షేర్ చేశారు. 

ఇంకో నెటిజన్ కామెడీగా స్పందిస్తూ..మరి వెచ్ బిర్యానీపై జీఎస్టీ అని అన్నాడు.. దీనికి మరో నెటిజన్ స్పందిస్తూ.. ఊకో బ్రదర్.. లేనిపోని ఐడియాలు ఇవ్వకు.. వచ్చే జీఎస్టీ మీటింగ్ మరింత పెంచినా పెంచేస్తుంది మేడమ్ నిర్మలా సీతారామన్.. అని హాస్యంగా రాశారు. 

2014లో జీఎస్టీ 24 శాతం ఉంటే ..2024లో 5శాతం అయింది .. రెస్టారెంట్లపై ట్యాక్స్ 5శాతానికి తగ్గించారు అని ఓ నెటిజన్ రాశారు.  


ఒక్క బిర్యానీ యే కాదు.. అన్ని రకాల వస్తువులపైనా జీఎస్టీ ట్యాక్స్ దారుణంగా ఉంది.. ఏది కొనలేని పరిస్థితి. 250 గ్రాముల ప్లెయిన్ కేక్ 100 అవుతుంది.. పావుకిలా బనానా చిప్స్ 75 రూపాయలు.. ఏమన్నా అంటే జీఎస్టీ అంటున్నారని ఓ నెటిజన్ రాశాడు. 

నెట్టింట జరిగిన జీఎస్టీ డిస్కషన్ లో ఓవరాల్ గా జీఎస్టీ సామాన్య, మధ్యతరగతిపై భారం అనే చెప్పాలి. అన్ని వస్తువులు జీఎస్టీపై దాదాపు 28 శాతం జీఎస్టీ పడుతోంది.. అన్ని రకాల ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటెమ్స్ పై జీఎస్టీ దాదాపు 28 శాతం పడుతోంది. మనం ఏది కొన్నా ఆ బిల్స్ లో సెంట్రల్ జీఎస్టీ(CGST), స్టేట్ జీఎస్టీ (SGST) అంటు రెండు రకాల ట్యాక్సులు వసూలు చేస్తున్నారు. వెయ్యి రూపాయల బిల్లు చేస్తే వాటిలో దాదాపు వస్తువును 120 నుంచి 180 వరకు ఉంటుంది(రెండు జీఎస్టీలు కలిపి). 

దాదాపు 500+ సేవలు , 1300 కంటే ఎక్కువ ఉత్పత్తులు 4 ప్రధాన GST స్లాబ్‌ల క్రిందకు వస్తాయి. ఇవి 5%, 12%, 18% , 28% రేట్లు కలిగి ఉంటాయి. పరిశ్రమల డిమాండ్లు, మార్కెట్ ట్రెండ్‌ల ప్రకారం వాటిని సర్దుబాటు చేయడానికి GST కౌన్సిల్ ప్రతి స్లాబ్ రేటు కింద వస్తువులను కాలానుగుణంగా సవరిస్తుంది.

ఇక ఈ పోస్ట్ షేర్ చేసిన కొద్ది గంటల్లోనే కామెంట్లు, లైకులు, డిస్ లైకులు, వాదన ప్రతివాదనలతో హోరెత్తింది. దాదాపు ఎక్కువమంది జీఎస్టీపై అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇంత ట్యాక్సులు కడుతున్నా మినిమం సౌకర్యాలు కూడా అందడం లేదని కొందరంటే.. స్టాబ్ ల ప్రకారం..ఎక్కువ వస్తువు, వస్తుసేవలపై 28 శాతం జీఎస్టీ వసూలు చేస్తు్న్నారని అంటున్నారు. జీఎస్టీ స్లాబ్ లలో మార్పులు చేసి సామాన్యులకు ఊరట కలిగేలా చేయాలని నెటిజన్లు కోరుతున్నారు.