అమెరికాలో ఇండియన్స్ పరిస్థితి ఇదే.. ఉద్యోగం ఊడితే తట్టా బుట్టా సర్దుకోవాల్సిందే!

అమెరికాలో ఇండియన్స్ పరిస్థితి ఇదే.. ఉద్యోగం ఊడితే తట్టా బుట్టా సర్దుకోవాల్సిందే!

అమెరికాకు చదువు, ఉద్యోగాల కోసం వెళ్లిన వారికి తిప్పలు తప్పడం లేదు. మంచి టెక్ కంపెనీలో లక్షల సాలరీతో జాబ్ దొరికినా.. అది ఎప్పుడు ఊడుతుందో చెప్పలేని పరిస్థితి. H1B వీసా రూల్స్ కఠినంగా మార్చేసరికీ.. జాబ్ పోయిన లేదా స్టూడెంట్ వీసా అయిపోతూ జాబ్ త్వరగా దొరకకున్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూస్ లో ఎంఎస్ చేసి జాబ్ కోసం జాబ్ కోసం వెతుకుతున్న, ఆల్ రెడీ జాబ్ చేస్తున్న వారు చాలా సవాళ్లు ఎదుర్కొంటున్నారు.
ayoffs.fyi  సేకరించిన డేటా ప్రకారం.. దాదాపు 438 టెక్ కంపెనీలు దాదాపు లక్షా 37వేల 500 మంది ఉద్యోగులను తొలగించాయి. ఆర్థిక మాంద్యంలకు వ్యతిరేకంగా టెక్ సెక్టార్ అవగాహనను విచ్ఛిన్నమైంది.

ALSO READ | లెబనాన్పై ఇజ్రాయిల్ బాంబుల వర్షం..492 మంది మృతి

ప్రస్తుత ఉద్యోగ కొరత H-1B వీసాదారులపై విపరీతమైన ఒత్తిడిని తెచ్చిపెట్టింది. జాబ్ పోయిన వారు కొత్త జాబ్స్ పొందేందుకు తక్కువ టైం పీరియడ్ ఉంది. ఆ టైంలోగా ఇంకో జాబ్ చూసుకోకుంటే అమెరికా ప్రభుత్వం వారి సొంత దేశాలకు పంపిస్తోంది. US కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ నివేదికల ప్రకారం.. చాలా మంది భారతీయ కార్మికులు గ్రీన్ కార్డ్‌ల కోసం సంవత్సరాలు అమెరికాలో వేయిట్ చేస్తున్నారు. 

పర్మినెంట్ వీసా H1B  కోసం  దరఖాస్తు చేసుకోవడానికి ఫీజు కూడా విపరీతంగా పెంచారు. ఒక్కో వ్యక్తి $10 నుంచి $215కి వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఓ పక్క లేఆఫ్స్.. మరో పక్క పెరుగుతున్న ఖర్చుల వల్ల  ఆర్థిక భారం ఎక్కువైతుంది. చేసేదేం లేదని వీసా టైం ముగియడంతో, ఇంకో జాబ్ కూడా రాకపోవడంతో బలవంతంగా ఇండియాకు రావాల్సిన పరిస్థితి వస్తోంది.