
- ఎన్వోసీలు ఇచ్చిన ఫైర్, జీహెచ్ఎంసీ, ఇరిగేషన్
- 100 ఎకరాల్లో రూ.2,583 కోట్లతో రాజేంద్రనగర్లో నిర్మాణం
హైదరాబాద్, వెలుగు: కొత్త హైకోర్టు నిర్మాణానికి ఈ నెలలో టెండర్లు పిలిచేందుకు ఆర్ అండ్ బీ రెడీ అవుతున్నది. హైకోర్టుకు సంబంధించి కీలకంగా ఉన్న నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ)కి అప్లై చేయగా పలు శాఖలు ఇచ్చాయి. ఫైర్, జీహెచ్ఎంసీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు ఎన్వోసీలు ఇవ్వగా.. ఎన్విరాన్ మెంట్ ఎన్వోసీ పెండింగ్ లో ఉందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఈ నెల 22న ఎన్విరాన్ మెంట్ ఎన్వోసీకి సంబంధించి మీటింగ్ ఉందని, అందులో క్లియరెన్స్ వస్తుందని పేర్కొన్నారు..
రాజేంద్రనగర్ లో 100 ఎకరాల్లో రూ.2,583 కోట్లతో కొత్త హైకోర్టు నిర్మాణానికి గతేడాది డిసెంబర్ లో లా డిపార్ట్ మెంట్ అడ్మినిస్ట్రేటివ్ సాంక్షన్ ఇచ్చింది. ఆర్ అండ్ బీ ఇచ్చిన డిజైన్ ను జడ్జిల కమిటీ ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 10 బ్లాకుల్లో సుమారు 36.5 లక్షల ఎస్ఎఫ్ టీలో 3వేల కార్లు పార్కింగ్ చేసేలా 63 మంది జడ్జిలకు కోర్టు హాల్స్, ఇండ్లు, సిబ్బంది క్వార్టర్స్, అడ్వకేట్ జనరల్ క్వార్టర్స్ కూడా నిర్మించనున్నారు.