న్యూఢిల్లీ: దేశమంతటా కొత్త ఇండ్ల అమ్మకాలు నానాటికీ తగ్గుతున్నాయి. ఇవి కరోనా నాటి స్థాయికి పడిపోయాయి. ధరలు విపరీతంగా పెరగడం, లోన్లపై వడ్డీ ఎక్కువ కావడంతో చాలా మంది ఇండ్ల జోలికి వెళ్లడం లేదు. దీంతో రియల్టర్ల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఈ కష్టాల నుంచి బయటపడాలంటే బడ్జెట్లో తమను ఆదుకునే నిర్ణయాలు ప్రకటించాలని వీరు కోరుతున్నారు.
సప్లై తగ్గడం, ధరలు పెరగడం వల్ల కూడా హౌసింగ్మార్కెట్ కస్టమర్లను ఆకర్షించలేకపోతోంది. ఈ విషయమై హౌసింగ్బ్రోకరేజ్ సంస్థ అనరాక్ చైర్మన్అనుజ్పురి మాట్లాడుతూ.. 2024లో తక్కువ ధర ఇండ్లకు గిరాకీ పడిపోయిందని, లగ్జరీ ఇండ్లకు డిమాండ్ పెరిగిందని చెప్పారు. దాదాపు 300 బిలియన్ డాలర్ల విలువైన ఇండియా రెసిడెన్షియల్రియల్ఎస్టేట్ మార్కెట్లో అమ్మకాలు ఈ ఏడాది నాలుగు శాతం తగ్గాయి.
అనరాక్డేటా ప్రకారం.. మనదేశంలో 2020లో అమ్మకాలు 47 శాతం తగ్గాయి. 2021లో 71 శాతం, 2022లో 54 శాతం, 2023లో 31 శాతం పెరిగాయి. కరోనా తరువాత సంపన్నులు లగ్జరీ ఫ్లాట్లను, విల్లాలను కొనడం పెరిగింది. ప్రస్తుత సంవత్సరంలోనూ ఇదే ట్రెండ్కనిపిస్తోంది. గత ఏడాది ఎన్నికల కారణంగా కొంత నష్టం జరిగిందని, 2025లో పరిస్థితి మెరుగుపడవచ్చని పురి అన్నారు.
ఇవీ డిమాండ్లు..
తక్కువ ధర ఇండ్ల అమ్మకాలు పెరగాలంటే హౌసింగ్లోన్ల వడ్డీపై పన్ను మినహాయింపు పరిమితిని మరింత పెంచాలన్నది రియల్టర్ల ప్రధాన డిమాండ్లలో ఒకటి. ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గిస్తే మరింత మంది హోంలోన్ల ద్వారా ఇండ్లు కొంటారని భావిస్తున్నారు. వ్యక్తులకు, డెవలపర్లకు ఈ బడ్జెట్లో ఇన్సెంటివ్స్అందించాలని సూచిస్తున్నారు. పాలసీపరమైన అడ్డంకులను కూడా తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని క్రెడాయ్ చైర్మన్బొమన్ఇరానీ అన్నారు.
సెక్షన్80సీ కింద ఇస్తున్న ప్రయోజనాలను మరింత పెంచాలని స్పష్టం చేశారు. వడ్డీరేట్లను తగ్గించకుండా రియల్ ఎస్టేట్మార్కెట్ ఎదగడం కష్టమని స్పష్టం చేశారు. నైట్‌ఫ్రాంక్ రిపోర్ట్ ప్రకారం 2022 నాటికి ఇండియన్ రియల్టీ మార్కెట్ సైజు 500 బిలియన్ డాలర్లు ఉంది. ఇది 2047 నాటికి 5.8 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా.