ప్రపంచంలో అందరికి సొంతింటి కల ఉంటుంది. చిన్నదైనా సొంతింటిని నిర్మించుకునేందుకు జనాలు ఆలోచిస్తుంటారు. దానిని కూడా వాస్తుప్రకారం నిర్మించుకోవాలి. లేదంటే ఒక్కోసారి అనేక ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అలా ఇల్లు నిర్మించుకునేవారు.. దేవుడి గది.. ఎక్కడ ఉండాలి... బెడ్ రూం ఎలా ఉండాలి.. మొక్కలు పెంచుకోవాలంటే ఏ దిశలో ఉండాలి.. నిద్రపోయేటప్పుడు తల ఏదిశగా పెట్టి పడుకోవాలో తెలుసుకుందాం. . .
ఇల్లు చిన్నగా ఉన్నా... దేవుడి మందిరం.. పూజ చేసుకోవడానికి ఉన్నంతలో పూజ స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అయితే కొన్ని ఇళ్లలో అంత స్థలం లేనప్పుడు టేబుల్ పై ఓ మూల దేవుడి పటాలు పెట్టి పూజలు చేసుకుంటారు. సిద్ధాంతులు తెలిపిన వివరాల ప్రకారం పూజగది పవిత్రమైంది. అందుకోసం ప్రత్యేకమైన స్థలం ఏర్పాటు చేసుకుంటే బెటర్. దేవుళ్ల చిత్రపటాలు కిందపెట్టి అటు, ఇటు తిరగడం మంచిది కాదు. కాబట్టి టేబుల్ పై పెట్టుకోవచ్చు, టేబుల్ కు సమాంతరంగా స్టూల్ పై కూర్చొని పూజలు చేసుకోవాలని సూచిస్తున్నారు.
మొక్కల విషయానికొస్తే... చాలామంది మనీ ప్లాంట్. కలబంద మొక్కలు ఉంటే శుభాలు జరుగుతాయని భావించి చాలామంది ఇంట్లో పెట్టుకుంటున్నారు. ఇవి తూర్పు, ఉత్తరం వైపు పెట్టుకుంటే మంచిది. ఇవి అందానికే కాదు... ఆక్సిజన్ కూడా ఇస్తాయి.
ఇంటి గుమ్మాల విషయానికొస్తే .... ప్రదాన ద్వారం దక్షిణ, నైరుతి దిశలో ఉండకూడదు. కాని అపార్ట్ మెంట్లలోని ఇళ్లు కొన్ని ఇలానే ఉంటాయి. అలాంటి వాటిని దక్షిణ ఆగ్నేయం వైపు మార్చుకుంటే మంచిది. ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు..తూర్పు ద్వారం నుంచి కాని.. ఉత్తర ద్వారం నుంచి కాని వచ్చేలా చూసుకోవాలి. ఇంకా బెడ్రూం, కిచెన్, వాటర్ ట్యాంక్.. లాంటివి కూడా వాస్తు ప్రకారం ఉండేట్టు ప్లాన్ చేసుకోవాలి.
ఇక నిద్రించేటప్పుడు కూడా కొన్ని నియమాలున్నాయి. కొంతమంది పొద్దున్నే నిద్ర లేవగానే దేవుడి చిత్ర పటాలు చూసే అలవాటు ఉంటుంది. అందుకని దేవుడి వైపు కాళ్లు పెట్టుకుని పడుకుంటారు. కాని దేవుడి ముఖంవైపు కాళ్లు పెట్టుకొని పడుకోవడం మంచిదికాదని పండితులు అంటున్నారు. దక్షిణంవైపు తలపెట్టుకొని ఉత్తరం వైపు కాళ్లు పెట్టి పడుకోవచ్చు. పడమర వైపు తల పెట్టుకొని, తూర్పు వైపు అయినా కాళ్లు పెట్టుకోవచ్చని వాస్తు నిపుణులు చెబుతున్నారు. సో .. మీరు కూడా సొంతింటి కోసం ప్లాన్ చేస్తే... వాస్తు ప్రకారం నిర్మించుకోండి.. కట్టిన ఇల్లు కొనేటప్పుడు అందులో ఏ గది ఎలా ఉంది.. వాస్తు ప్రకారం ఉందా లేదా.. అనే విషయాలను జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోండి. . .