అల్లర్లలో కాలిపోయిన ఇంటికి బదులు కొత్త ఇల్లు
ప్రకంటించిన డీఐజీ పుష్పేంద్ర రాథోడ్
వెస్ట్ బెంగాల్లో డ్యూటీ చేస్తున్న జవాన్ మొహమ్మద్ అనీస్
అతడి ఇంటికి నిప్పు పెట్టిన దుండగులు.. ఫ్యామిలీ సేఫ్
రూ.10 లక్షల సాయం ప్రకటించిన బీఎస్ఎఫ్..
న్యూఢిల్లీ: ఢిల్లీ మెల్లగా కోలుకుంటోంది. పరిస్థితి క్రమంగా సద్దుమణుగుతోంది. హింసకు భయపడి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన వారు తిరిగి ఇండ్లకు చేరుకుంటున్నారు. కానీ.. నార్త్ఈస్ట్ ఢిల్లీలోని జఫ్రాబాద్, మౌజ్‌పూర్, గోకల్‌పురి, ఖజూరిఖాస్, భజన్‌పూర్ ఏరియాల్లో ఎటు చూసినా కాలిపోయిన ఇండ్లు, షాపులే. వాటిని చూసి బాధితులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. సామాన్లు సర్దుకుంటున్న వారు కొందరైతే.. రిపేర్లు చేసుకుంటున్నవారు ఇంకొందరు. అల్లరి మూకల దాడిలో బీఎస్ఎఫ్ జవాన్ ఇల్లు కూడా కాలిపోయింది. అతడి ఫ్యామిలీ అంతా రోడ్డుమీద పడింది. దీంతో అతడికి పెండ్లి కానుకగా అక్కడే ఇల్లు నిర్మించి ఇస్తామని బీఎస్ఎఫ్ ప్రకటించింది.
ఏప్రిల్ లోపు నిర్మాణం
ప్రస్తుతం వెస్ట్ బెంగాల్‌లోని సిలిగురి సమీపంలో రాధాబరి బీఎస్ఎఫ్ క్యాంప్‌లో 29 ఏళ్ల మొహమ్మద్ అనీస్ డ్యూటీ చేస్తున్నాడు. త్వరలోనే అతడిని ఢిల్లీకి బదిలీ చేస్తామని, దీంతో ఫ్యామిలీకి దగ్గరగా ఉంటాడని, పెండ్లి ఏర్పాట్లు చేసుకుంటాడని ఓ సీనియర్ ఆఫీసర్ చెప్పారు. కానిస్టేబుల్ ఫ్యామిలీ ఉంటున్న ఇల్లు డ్యామేజ్ అయిందని మీడియా రిపోర్టుల ద్వారా తెలిసిందని చెప్పారు. ‘‘అల్లరి మూకలు అతడి ఇంటికి నిప్పుపెట్టాయి. అదృష్టం కొద్దీ కానిస్టేబుల్ ఫ్యామీలీ మెంబర్స్ సేఫ్‌గానే ఉన్నారు. ఇల్లు చాలావరకు డ్యామేజ్ అయింది. రీబిల్ట్ చేయాల్సి ఉంది” అని వివరించారు. అనీస్ పేరెంట్స్, ఫ్యామిలీని కలిసిన బీఎస్ఎఫ్ డీఐజీ పుష్పేంద్ర రాథోడ్.. అన్ని విధాలా సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ‘‘వెల్ఫేర్ ఫండ్ నుంచి రూ.10 లక్షలు ఇవ్వాలని నిర్ణయించాం. అలాగే మా ఇంజనీరింగ్ వింగ్.. కొత్త ఇంటిని నిర్మించి ఇస్తుంది” అని వివరించారు. ఏప్రిల్‌లో అనీస్ పెండ్లి జరిగేలోగా ఇంటిని రెడీ చేస్తామని, అదే వారికి పెండ్లి కానుక అన్నారు.
ఢిల్లీ సర్కారు.. వాట్సాప్ నంబర్
ఎవరైనా విద్వేష మెసేజ్‌లు సర్క్యులేట్ చేస్తే ఫిర్యాదు చేసేందుకు వాట్సాప్ నంబర్ తీసుకురావాలని ఢిల్లీ ప్రభుత్వం భావిస్తోంది. సోషల్ మీడియాలో వచ్చే రూమర్లకు చెక్ పెట్టేందుకు ఈ దిశగా ఆలోచనలు చేస్తోంది. హేట్ మెసేజ్‌లు ఫార్వర్డ్ చేయొద్దని, ప్రస్తుత పరిస్థితుల్లో అవి రెండు వర్గాల మధ్య శత్రుత్వానికి దారి తీసే ప్రమాదం ఉందని అధికారులు చెప్పారు. ‘‘ఎవరికైనా అభ్యంతరకర మెసేజ్ లేదా వీడియో వస్తే.. వెంటనే ఢిల్లీ ప్రభుత్వానికి ఫిర్యాదు చేయవచ్చు. మెసేజ్ పంపిన వ్యక్తి, ఫోన్ నంబర్ వివరాలు ఇవ్వాలి’’ అని తెలిపారు. వాట్సాప్ నంబర్ నిర్వహించేందుకు, నిజమైన ఫిర్యాదులను టేకప్ చేసి, చర్యలు తీసుకునేందుకు ఓ అధికారి నియమించనున్నారు.
ఎంపీ.. రెండు నెలల జీతం
వివాదాస్పద కామెంట్లతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే పర్వేశ్ వర్మ.. ఢిల్లీ అల్లర్ల బాధితులకు 2 నెలల జీతాన్ని విరామిచ్చారు. చనిపోయిన కానిస్టేబుల్, ఐబీ ఉద్యోగి కుటుంబాలకు చెరొక నెల శాలరీ ఇస్తానని చెప్పారు. ‘‘డ్యూటీ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన హెడ్ కానిస్టేబుల్ రతన్‌లాల్, ఐబీ ఎంప్లాయ్ అంకిత్ శర్మ కుటుంబాలకు ఓ ఎంపీగా నా జీతాన్ని ఇస్తున్నా” అని చెప్పారు.
For More News..