లోక్‌సభలో కొత్త ఇన్‌కమ్‌ ట్యాక్స్ బిల్లు: మార్పులు, చేర్పులు ఇవే

లోక్‌సభలో కొత్త ఇన్‌కమ్‌ ట్యాక్స్ బిల్లు: మార్పులు, చేర్పులు ఇవే

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. గురువారం(ఫిబ్రవరి 13) కొత్త ఆదాయపు పన్ను బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. 1961 ఆదాయ పన్ను చట్టంలోని కఠిన నిబంధనలు, పదాలు, వివరణల్ని సరళతరం చేస్తూ ఈ బిల్లును తీసుకొచ్చామని  ఆర్థిక మంత్రి వివరించారు. బిల్లును లోక్‌సభ సెలెక్ట్ కమిటీకి సూచించాలని ఆమె లోక్‌సభ స్పీకర్‌ను కోరారు.

ప్రస్తుతం అమలులో ఉన్న దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. కొత్త చట్టం ఏప్రిల్ 1, 2026 నుండి అమల్లోకి రానుంది.

Also Read :- రాజ్యసభలో వక్ఫ్ సవరణ బిల్లుపై జేపీసీ నివేదిక ఆమోదం

కొత్త ఇన్‌కమ్‌ ట్యాక్స్ బిల్లు మార్పులు, చేర్పులు ఇవే..

  • కొత్త ఆదాయపు పన్ను బిల్లు(2025) భాషను సులభతరం చేస్తుంది. అంటే సరళతరమైన భాష, చిన్నచిన్న వాఖ్య నిర్మాణాలు, అనవసరమైన నిబంధనలు తొలగించారు.
  • ఈ బిల్లు ఎటువంటి కొత్త పన్నులు విధించదు. 1961 ఆదాయపు పన్ను చట్టంలో ఉన్న పన్నులే ఉంటాయి.
  • 1961 ఐటీ చట్టంలో 298 సెక్షన్లు, 23 చాఫ్టర్లు, 14 షెడ్యూల్‌లు ఉండగా.. కొత్త చట్టంలో 536 సెక్షన్లు, 23 చాఫ్టర్లు, 16 షెడ్యూల్‌లు ఉన్నాయి. మొత్తం 622 పేజీలు. మునుపటితో పోల్చితే కొత్తదాంట్లో సెక్షన్లు, షెడ్యూళ్లను పెంచారు.
  • కొత్త చట్టం 2026 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి రానుంది. చట్టం నోటిఫై చేయబడిన తర్వాత నియమ నిబంధనలు అమల్లోకి వస్తాయి.
  • ప్రస్తుతం ఏప్రిల్‌ 1 నుంచి మార్చి 31 వరకు అసెస్‌మెంట్‌ ఇయర్‌ అని పిలుస్తుండగా.. కొత్త బిల్లులో ట్యాక్స్‌ ఇయర్‌గా మార్చారు. అంటే మునుపటి సంవత్సరం(Previous year)', 'అంచనా సంవత్సరం(Assessment year) వంటి కష్టమైన పదాలను కొత్త బిల్లులో తొలగించి.. 'పన్ను సంవత్సరం(Tax Year)' అనే ఒక్క పదంతో సరిపెట్టారు. 
  • ప్రస్తుత చట్టంలో చాలాసార్లు కనిపించే ‘నాట్‌విత్‌స్టాండింగ్‌(notwithout)’ పదం స్థానంలో ‘ఇర్రెస్పెక్టివ్‌(irrespective)’ పదాన్ని చేర్చారు.
  • పన్ను చెల్లింపుదారుల హక్కులు, బాధ్యతలు వివరించే పన్ను చెల్లింపుదారుల చార్టర్‌ను బిల్లులో చేర్చారు.
  • సాధారణ పన్ను చెల్లింపుదారులూ చదవడానికి వీలుగా టేబుల్స్‌, ఫార్ములాలు పొందుపరిచారు.
  • జీతాల్లో స్టాండర్డ్‌ డిడక్షన్‌, గ్రాట్యుటీ, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ వంటి తగ్గింపులన్నీ ఒకే చోట. మునుపు వివిధ సెక్షన్లు, రకరకాల నిబంధనల్లో ఇవి ఉండేవి.
  • వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్‌), ఇతరుల కోసం కొత్త, పాత ఆదాయ పన్ను విధానాలకు వర్తించేలా చట్టం.
  • మార్కెట్‌ ఆధారిత డిబెంచర్లలో మూలధన లాభాల కంప్యూటేషన్‌ కోసం ప్రత్యేక ప్రొవిజన్లు.