
కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు ఇప్పుడు చర్చనీయాంశమైంది.ఇదేదో పన్ను చెల్లింపుదారులకు మేలు చేసేది అనుకుంటే పొరపాటే. ప్రభుత్వం పన్ను చట్టాలను సరళీ కృతం చేసినప్పటికీ బిల్లు అంతర్లీనంగా ఉన్న నిబంధన ఇప్పుడు ట్యాక్స్ పేయర్లును ఆందోళనకు గురిచేస్తోంది. ఈ పన్ను సవరణ బిల్లు ప్రకారం..అధికారులు ఈమెయిల్స్, ట్రేడింగ్ ఖాతాలు, సోషల్ మీడియా ప్రొఫైల్ అన్నింటిని పరిశీలించే అధికారం ఉంటుంది.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ఇన్కమ్ ట్యాక్స్ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బిల్లు చట్టంగా మారేముందు దానిని సెలెక్ట్ కమి టీ సమీక్షకు పంపారు. ఇందులో ఆందోళనకరమైన విషయం ఏంటంటే పన్ను శోధన పరిధిని విస్తరించే నిబంధన. అంటే ఆదాయపన్ను ఎగవేత దారులను గుర్తించే క్రమంలో అధికారులు ఈమెయిల్స్, ట్రేడింగ్ ఖాతాలు, సోషల్ మీడియా ప్రొఫైల్ అన్నింటిని పరిశీలించే అధికారం ఉంటుంది.
ALSO READ | బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్: ఈ దెబ్బతో జియో, ఎయిర్టెల్ కు చుక్కలే..
ప్రస్తుతం ఈమెయిల్స్, ట్యాప్టాప్లు హార్డ్డిస్క్లు యాక్సెస్ ఇవ్వాలని ఆదాయపు శాఖ అధికారులు కోరవచ్చు. పన్ను చెల్లింపుదారుడు నిరాకరిస్తే వాటి పాస్వర్డ్ లను తీసుకోవచ్చు..ఓవర్ రైడ్ చేయొచ్చు..ఫైల్స్ అన్లాక్ చేయొచ్చు.
కొత్త ఆదాయపు పన్ను బిల్లులోని నిబంధన 247 ప్రకారం..పన్ను ఎగవేత లేదా పన్ను చెల్లించని వెల్లడించని ఆస్తులను గుర్తించినట్లయితే ఏప్రిల్1, 2026 నుంచి వారి ఈమెయిల్స్, సోషల్ మీడియా, బ్యాంక్ వివరాలు , పెట్టుబడి ఖాతాలను ఆదాయపు పన్ను అధికారులు యాక్సెస్ చేయొచ్చు.