రైళ్లు, సిగ్నిలింగ్ వ్యవస్థల నియంత్రణకు సంబంధించిన సర్వీసులందించే క్వాండ్రాంట్ ఫ్యూచర్ టెక్ లిమిటెడ్ ( Quadrant Future Tek limited ) పబ్లిక్ ఇష్యూ(IPO) జనవరి 7న ప్రారంభం కానుంది. 9న ముగియనుంది. ఇష్యూకి షేర్ల ధరను 275నుంచి 290 మధ్య ప్రకటిచింది.
షేర్ల అమ్మకం ద్వారా రూ. 290 కోట్ల నిధులు సేకరించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 50 షేర్లకు (ఒక లాట్) కొనాల్సి ఉంటుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు జనవరి 6న షేర్ల విక్రయం జరుగుతుంది.
పబ్లిక్ ఇష్యూల ద్వారా సేకరించిన నిధులను రూ. 150 వరకు దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, రూ. 24 కోట్లు ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ వ్యవస్థ అభివృద్ధికి , మరో రూ. 24 కోట్లు రుణాలు చెల్లించేందుకు వినియోగించనుంది.
ALSO READ | CEO Jagdeep Singh: రోజుకు రూ. 48కోట్లు.. ప్రపంచంలోనే అత్యధిక జీతం.. మన భారతీయుడికే
క్వాడ్రాంట్ ఫ్యూచర్ కంపెనీ రైల్వే రక్షణ సంబంధ వ్యవస్థల అభివృద్దిపై పనిచేస్తుంది. దీంతోపాటు రైల్వే రోలింగ్ స్టాక్, నౌకా(ఢిఫెన్స్) పరిశ్రమల్లో వినియోగించే కేబుళ్లను సైతం తయారు చేస్తోంది.