న్యూఢిల్లీ: కొత్త ఆదాయపు పన్ను బిల్లును వచ్చే వారం పార్లమెంటులో ప్రవేశ పెడతామని మంత్రి నిర్మల ప్రకటించారు. దీనిని సులువుగా అర్థం చేసుకోవచ్చని, చట్టాలను మరింత సరళీకరిస్తామన్నారు. ఫేస్లెస్అసెస్మెంట్సహా గత పదేళ్లలో ట్యాక్స్‌పేయర్ల కోసం ఎన్నో మార్పులు తెచ్చామని చెప్పారు.
99 శాతం ఐటీ రిటర్నులు సెల్ఫ్అసెస్మెంట్ ద్వారానే జరుగుతున్నాయని చెప్పారు. ఇక నుంచి రిటర్నుల ప్రాసెస్‌ను మరింత త్వరగా పూర్తి చేస్తామని, ట్యాక్స్‌పేయర్ల చార్ట్‌ను తెస్తామని నిర్మల వివరించారు. 1961 నాటి ఐటీ చట్టంలో మార్పులు తేవడానికి సీబీడీటీ ఇంటర్నల్కమిటీని నియమించింది.